Ramchander Rao | ‘సర్’లో ఆ మూడు పార్టీలు అక్రమాలు : రామచందర్ రావు
Ramchander Rao | తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సర్ ప్రక్రియలో అక్రమ వ్యక్తులకు దొడ్డిదారిన మార్గం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు.
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సర్ ప్రక్రియలో అక్రమ వ్యక్తులకు దొడ్డిదారిన మార్గం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో సర్ రెండో విడత ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా, హైదరాబాద్‌లో నిర్వహించిన సర్ వర్క్‌షాప్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి రామచందర్ రావు ప్రసంగించారు.
బీజేపీ కార్యకర్తలు సర్ ప్రక్రియలో అహర్నిశలు శ్రమిస్తూ, ఇంటింటికీ వెళ్లి ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేస్తున్నారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ల జారీ తీవ్రమైన అనుమానాలకు తావిస్తోంది. అక్రమ వ్యక్తులకు చట్టబద్ధత కల్పించే స్పష్టమైన ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయడంతో పాటు, అనుమానాస్పదమైన లేదా అనర్హమైన నమోదులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ తమ కృషిని మరింత వేగవంతం చేయాలని కార్యకర్తలకు రామచందర్ రావు పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?





