CM Revanth Reddy | రేపు సిద్ధిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు సిద్దిపేట (Siddipet) జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని (Oil Palm Factory) సీఎం ప్రారంభించనున్నారు.
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు సిద్దిపేట (Siddipet) జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని (Oil Palm Factory) సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రేపు సాయంత్రం 4 గంటలకు నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించి పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు. తెలంగాణలో మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు స్థానిక అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెలిపాడ్, సభా వేదిక, భద్రత, తాగునీరు, ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, విద్యుత్, సౌండ్ సిస్టమ్, ఫైర్,అంబులెన్స్ తదితర వాటిపై అధికారులకు సూచనలు చేశారు.
ఇప్పటికే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో గత మూడు రోజులుగా రైతు మహోత్సవాలు జరుగుతున్నాయి. రైతు మహోత్సవాలకు వివిధ జిల్లాల నుండి భారీగా రైతన్నలు తరలివస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 150 స్టాల్స్‌లో వ్యవసాయ యాంత్రీకరణ, ఆయిల్ ఫామ్ తోటల పెంపకంలో మెలుకువలు, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల ద్వారా అధిక దిగుబడి సాధించడానికి శాస్త్రవేత్తల ద్వారా మెలుకువలు నేర్చుకోవడంతో ఆధునిక వ్యవసాయాన్ని అవగాహన చేసుకుంటున్నారు.
Also Read..
యుద్ధం మరింత తీవ్రం.. హిందూ మహాసముద్రంలోని యూఎస్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
ఇన్‌ఫ్లుయెన్సర్ ఆసక్తికర రీల్.. స్పందించిన ప్రధాని మోదీ.. ఇంతకీ విషయం ఏంటంటే..?
ఒకప్పుడు కరువుతో అల్లాడిన సిద్దిపేటకు వరంలా మారిన కాళేశ్వరం: హరీశ్ రావు
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



