Harish Rao | ఒకప్పుడు కరువుతో అల్లాడిన సిద్దిపేటకు వరంలా మారిన కాళేశ్వరం: హరీశ్ రావు
Harish Rao | నాడు పశుగ్రాస కేంద్రాలు పెట్టిన ప్రాంతంలో.. నేడు కాళేశ్వరంతో (Kaleshwaram) రెండు పంటలు పండుతున్నాయని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం జలాలతో సిద్దిపేటలో (Siddipet) పంట సాగు 8 వేల నుంచి 80 వేల ఎకరాలకు పెరిగిందని చెప్పారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: నాడు పశుగ్రాస కేంద్రాలు పెట్టిన ప్రాంతంలో.. నేడు కాళేశ్వరంతో (Kaleshwaram) రెండు పంటలు పండుతున్నాయని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం జలాలతో సిద్దిపేటలో (Siddipet) పంట సాగు 8 వేల నుంచి 80 వేల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన సిద్దిపేట ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరంలా మారిందని తెలిపారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మొన్న అసెంబ్లీలో తాము గట్టిగా చేసిన ఒత్తిడితో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.
`మా పోరాటం ఫలితంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. క్వింటాల్‌కు రూ. 2400 మద్దతు ధర ఉంటే.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో నిన్నటిదాకా రైతులు బయట దళారులకు రూ.1600 నుంచి రూ.1700లకే అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ముందే ఈ కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులందరికీ మేలు జరిగేది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే 20 నుంచి 25 శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికైనా రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలి.
మన ప్రాంతంలో సన్‌ఫ్లవర్ కూడా బాగా సాగు చేస్తున్నారు. దానికి కూడా ఈరోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించాం. పొద్దుతిరుగుడు క్వింటాల్‌కు రూ.7721 మద్దతు ధర ఉంది. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయం పొందాలి. సన్‌ఫ్లవర్ తక్కువ కాలంలో పూర్తయ్యే పంట. దీనివల్ల అధిక ఆదాయంతో పాటు మంచి దిగుబడి కూడా వస్తుంది. పంట మార్పిడికి కూడా ఇది ఎంతో ఉపయోగకరం. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని రైతులకు పిలుపునిస్తున్నా.
ఈ యాసంగిలో మన సిద్దిపేట ప్రాంతంలో ఇంత మంచి దిగుబడి వస్తుందంటే, ఈ స్థాయిలో పంటలు పండుతున్నాయంటే దానికి ఏకైక కారణం కాళేశ్వరం ప్రాజెక్టే. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో యాసంగి సాగు కేవలం 8 వేల ఎకరాలు మాత్రమే ఉండేది. కానీ ఇవాళ కాళేశ్వరం జలాల పుణ్యమా అని అది పదింతలు పెరిగి ఏకంగా 80 వేల ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతున్నది. 2005లో కరువు వచ్చిన పరిస్థితులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. తాగడానికి నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక అల్లాడిపోయాం.
పశువులను బతికించుకోవడానికి చిన్నకోడూరు, రాజగోపాల్‌పేట, నంగునూరులో పశుగ్రాస కేంద్రాలు పెట్టి ఆంధ్రా నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి తెచ్చి రైతులకు పంపిణీ చేశాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక సిద్దిపేట దరిదాపుల్లో కరువు అనే మాటే లేదు. వానలు పడినా, పడకపోయినా కాలంతో సంబంధం లేకుండా రైతులు రెండు పంటలు పండిస్తూ బంగారం లాంటి దిగుబడులు సాధిస్తున్నారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన మన ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరంలా మారింది. ఈ ప్రాజెక్టు మన ప్రాంత రూపురేఖలను మార్చేసి, వ్యవసాయానికి కొత్త దిశానిర్దేశం చేసింది. రైతులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దు, కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధరను పూర్తిస్థాయిలో పొందాలి.` అని హరీశ్ రావు సూచించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



