త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు..? బండి భ‌గీర‌థ్ కేసుపై సీఎం రేవంత్ ప్ర‌శ్న‌

CM Revanth Reddy | ఒక మైన‌ర్ అమ్మాయికి అన్యాయం జ‌రిగితే లీడ‌ర్ ఆఫ్ అపోజిష‌న్ ఎక్క‌డ ప‌డుకున్నాడు..? అని సీఎం రేవంత్ రెడ్డి నిల‌దీశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా పోక్సో కేసుపై ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు అని సీఎం ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On May 21, 2026, 4.50 pm IST

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు..? బండి భ‌గీర‌థ్ కేసుపై సీఎం రేవంత్ ప్ర‌శ్న‌
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఒక మైన‌ర్ అమ్మాయికి అన్యాయం జ‌రిగితే లీడ‌ర్ ఆఫ్ అపోజిష‌న్ ఎక్క‌డ ప‌డుకున్నాడు..? అని సీఎం రేవంత్ రెడ్డి నిల‌దీశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా పోక్సో కేసుపై ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు అని సీఎం ప్ర‌శ్నించారు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సీఎం స‌మాధానం ఇచ్చారు.

లేడీకి లేచిందే ప‌రుగు అనుకున్న‌ట్టు కేటీఆర్ వ్య‌వ‌హార‌శైలి ఉంది. క‌ల్వ‌కుంట్ల రాజ్యాంగం అనుకుంటున్న‌డు. వాళ్ల నాన్న దిగిపోయి చాలా రోజులైంది. వాళ్ల నాన్న ఫామ్ హౌజ్‌లో ప‌డుకుండు అని ఆయ‌న‌కు అర్థ‌మైత‌లేదు. ఈయ‌న చెప్పింది నిజ‌మైతే వాళ్ల నాన్న ఎందుకో స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు. ఒక మైన‌ర్ అమ్మాయికి అన్యాయం జ‌రిగితే లీడ‌ర్ ఆఫ్ అపోజిష‌న్ ఎక్క‌డ ప‌డుకున్నాడు..? యేడ నిద్ర పోతున్నాడు. బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడ‌డానికి శ‌క్తి లేక‌పోయినా ప్రెస్‌నోట్ అయినా రిలీజ్ చేయాలి క‌దా..? ప‌క్క పార్టీవోడు వ‌స్తేనేమో జ‌గిత్యాల పోయి వ‌స్త‌డు.. కానీ ఇంత మేజ‌ర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జ‌రిగితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఎక్క‌డికి పోయిండు..? స్పందించ‌డా..? ఆయ‌న‌కు బాధ్య‌త లేదా..? ఆ బాధిత కుటుంబానికి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అండ‌గా నిల‌బ‌డాలి క‌దా..? ప‌దేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అధికారంలో ఉంటేనే బ‌య‌ట‌కు వ‌స్తావా..? అధికారంలో లేక‌పోతే బ‌య‌ట‌కు రావా..? అని మీరు ఎవ‌రైనా అడిగారా..? ఆయ‌న త‌ర‌పున వ‌కాల్తా పుచ్చుకునే బంట్రోతులనైనా అడ‌గండి అని సీఎం రేవంత్ సూచించారు.

Advertisement
Advertisement