త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు

KTR | విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందామని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం (Telangana Formation Day) సంద‌ర్భంగా ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ ట్వీట్ పెట్టారు.

D

Telangana | Published On Jun 2, 2026, 11.08 am IST

KTR | విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు
Advertisement

KTR | అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2 అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) అన్నారు. అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి… 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2 అని పేర్కొన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం (Telangana Formation Day) సంద‌ర్భంగా ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ ట్వీట్ పెట్టారు.

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2 అని కేటీఆర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2 అని చెప్పారు. కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసిందన్నారు.

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ.. ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందామన్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అమరవీరులకు కేటీఆర్‌ జోహార్లు తెలిపారు.

Also Read..

దేశ ప్రగతిలో తెలంగాణ కీల‌క పాత్ర పోషించాలి : గ‌వ‌ర్న‌ర్ శివ్‌ ప్ర‌తాప్ శుక్లా

ప్ర‌భుత్వ ఉద్యోగ నోటిఫికేష‌న్ల జారీ ఇక నిరంత‌ర ప్ర‌క్రియ : సీఎం రేవంత్ రెడ్డి

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వ‌రుస షాకులు.. 7వ స్థానానికి ప‌డిపోయిన స్టాక్ మార్కెట్ ర్యాంకు..

Advertisement
Advertisement