Medaram | మేడారం గద్దెల వద్ద జారిపడిన రాతిశిల.. బాలుడికి తీవ్ర గాయాలు
Medaram | మేడారంలోని (Medaram) వన దేవతల గద్దెల ప్రాంగణ పునఃనిర్మాణ పనులు మేడిపండు చందంగా తయారయ్యాయి. రానున్న వెయ్యేండ్లపాటు నిలిచిపోయేలా పనులు చేపడుతున్నామని ఆలయ పునఃనిర్మాణ పనులకు పునాదినాడు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే.
Medaram | త్రినేత్ర.న్యూస్: మేడారంలోని (Medaram) వన దేవతల గద్దెల ప్రాంగణ పునఃనిర్మాణ పనులు మేడిపండు చందంగా తయారయ్యాయి. రానున్న వెయ్యేండ్లపాటు నిలిచిపోయేలా పనులు చేపడుతున్నామని ఆలయ పునఃనిర్మాణ పనులకు పునాదినాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మేడారం మహాజాతర పనులు ముగిసి ముచ్చటగా మూడు నెలలు కూడా గడువకముందే నిర్మాణాలు విరిగిపడిపోతున్నాయి. దీంతో భక్తులు ప్రమాదాల బారినపడుతున్నారు.

తాజాగా వన దేవతల గద్దెల ప్రాంగణ పునఃర్నిర్మాణ పనుల వద్ద రాతిశిల జారిపడి ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వనదేవతల జాతర పూజారి సిద్దబోయిన రాణా రమేశ్ బుధవారం మేడారానికి వచ్చిన ప్రముఖులకు దేవతల దర్శనం చేయించే పనిలో నిమగ్నమయ్యారు. సాయంత్రం 5గంటల సమయంలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆడుకుంటున్న ఆయన కుమారుడు యూవిన్ నిర్మాణంలో ఉన్న రాతి శిలపై కూర్చున్నాడు. దీంతో శిల జారడంతో అతడు కిందపడిపోయాడు. అతడి పాదంపై రాతి శిల పడటంతో కాలు నుజ్జునుజ్జయింది. బాలుడికి వరంగల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయిస్తున్నారు.

పనుల్లో నాణ్యతా లోపం..
మేడారంలో రూ.101 కోట్లతో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రోజుల వ్యవధిలోనే (ప్రారంభించిన 16వ రోజుకే) సమ్మక్క-సారలమ్మ గద్దెల చుట్టూ నిలబెట్టిన రాతిస్తంభాలు విరిగిపోయాయి. అభివృద్ధిలో భాగంగా గద్దెల చుట్టూ కంక (వెదురు) ఆకారాన్ని పోలిన శిలాకృతులు విరిగిపోయాయి. గద్దెల ప్రాంగణంలో వేసిన ఫ్లోరింగ్ అంతా ఎక్కడికక్కడ దస్కిపోతూ, జారిపోతూ, పగుళ్లు వచ్చాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక రాయిని తెప్పించి.. దానిపై ఆదివాసీ సంస్కృతిని తెలిపే ఆనవాళ్లను రూపొందించామని సర్కార్ గొప్పలు చెప్పుకున్నది. సర్కార్ చేపట్టిన పనులు ‘పైన పటారం.. లోన లొటారం’లా మారాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఇవికూడా చదవండి..
హర్మూజ్‌లో భారత నౌకలపై ఎలాంటి ఆంక్షల్లేవ్.. ఇరాన్ కీలక ప్రకటన
పద్మానదిలో పడిన బస్సు.. 23 మంది దుర్మరణం.. వీడియో
బ్యాండ్‌మేళం రివ్యూ - తెలంగాణతనం లేని తెలంగాణ సినిమా - ఆడియెన్స్‌కు బ్యాండ్ బాజా భరాత్
తాజావార్తలు
- ●Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?
- ●Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?
- ●HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్
- ●Horoscope | ఆగస్టు 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించిన ఆర్థిక లాభాలు..!
- ●Nizamabad | నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫరల్ హోదా
- ●Telangana Voter List 2026 | ఓటరు జాబితా ప్రక్షాళన: ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు ఒకే పోలింగ్ బూత్

Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?

Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?

HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్

Horoscope | ఆగస్టు 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించిన ఆర్థిక లాభాలు..!






