Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?
Vastu Tips | చాలా మంది తమ ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ పువ్వు( Rose Flower )ను వాడుతుంటారు. ప్రేమికులకే కాదు.. ఈ గులాబీ పువ్వు.. అప్పుల పాలైన వారిని కుబేరులుగా కూడా మార్చుతుందట. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గులాబీ పువ్వును ఇంట్లో పెంచుకుంటే.. అప్పుల నుంచి విముక్తి లభిస్తుందట.
Devotional | Published On Aug 4, 2026, 6.29 am IST
Vastu Tips | చాలా మంది తమ ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ పువ్వు( Rose Flower )ను వాడుతుంటారు. ప్రేమికులకే కాదు.. ఈ గులాబీ పువ్వు.. అప్పుల పాలైన వారిని కుబేరులుగా కూడా మార్చుతుందట. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గులాబీ పువ్వును ఇంట్లో పెంచుకుంటే.. అప్పుల నుంచి విముక్తి లభిస్తుందట. మరి ఇంట్లో గులాబీ మొక్కను పెంచుకుంటే శుభమా..? అశుభమా..? మరి ఏ దిశలో నాటాలి..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
గులాబీ పువ్వు అందానికి ప్రతీక. ముఖ్యంగా ప్రేమకు సంకేతంగా వినియోగిస్తారు. ఇద్దరి మనసులు కలిసిన వేళ తమ ప్రేమను వ్యక్తపరచడానికి వాడేది గులాబీ పువ్వునే. అయితే ఈ గులాబీకి ఆధ్యాత్మికంగా కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంట్లో గులాబీ మొక్కను పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ఇంటి యజమాని కుబేరుడుగా మారిపోతాడట.

గులాబీ మొక్క శుభమా..? అశుభమా..?
గులాబీ మొక్కను ఇంట్లో పెంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటికి అందాన్నే ఇవ్వడం కాకుండా.. ఆ ఇంట్లో సానుకూల శక్తిని కూడా ఏర్పడుతుందట. లక్ష్మీదేవి కూడా కనికరించి.. అప్పుల నుంచి విముక్తి చేస్తుందట. ఐశ్వర్యం, శ్రేయస్సు, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందట. కుటుంబ సభ్యుల్లో ప్రేమ, ఆప్యాయతలను పెంచుతుందట. దంపతులైతే అనోన్యంగా ఉంటారట. మొత్తంగా ఇంట్లో గులాబీ పెంచుకోవడం శుభమేనని వాస్తు పండితులు చెబుతున్నారు.

మరి ఏ దిశలో గులాబీ మొక్కను నాటాలి..?
ఇంట్లో గులాబీ మొక్కను పెంచుకోవాలంటే కేవలం రెండు దిశలే ఉత్తమమని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇంటి ఆవరణలో తూర్పు లేదా ఉత్తర దిశలోనే గులాబీ మొక్కను నాటడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. తూర్పు దిశలో గులాబీ మొక్కను పెంచడం అత్యంత శుభప్రదమని చెబుతున్నారు. ఈ దిశ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందట. ఉత్తర దిశలో గులాబీ మొక్కను నాటడం వల్ల.. సంపద పెరిగిపోయి.. ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారట.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!






