Rakesh Kumar | ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏపీలో ఇస్తేనే తెలంగాణల ఇస్తరా?
Rakesh Kumar | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా బకాయిలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పడం బాధ్యతారాహిత్యమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.చిరుమళ్ల రాకేష్ కుమార్ విమర్శించారు. "ఆంధ్రప్రదేశ్ ఇస్తేనే తెలంగాణ ఇస్తుంది" అని ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదని ఎద్దేవా చేశారు. కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి సమస్యను మరింత క్లిష్టం చేయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
- అలా అని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు కదా
- ఏపీలో కూడా బకాయిలు ఉన్నయని సీఎం చెప్పడం బాధ్యతారాహిత్యం
- కొత్త జీవోలతో టైం వేస్ట్ చేయకుండా వెంటనే విడుదల చేయాలి
- కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.చిరుమళ్ల రాకేష్ కుమార్ డిమాండ్
Rakesh Kumar | త్రినేత్ర.న్యూస్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా బకాయిలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పడం బాధ్యతారాహిత్యమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.చిరుమళ్ల రాకేష్ కుమార్ విమర్శించారు. "ఆంధ్రప్రదేశ్ ఇస్తేనే తెలంగాణ ఇస్తుంది" అని ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదని ఎద్దేవా చేశారు. కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి సమస్యను మరింత క్లిష్టం చేయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై ఫైరయ్యారు.
వేలాది మంది విద్యార్థుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా బకాయిలు వెంటనే విడుదల చేయాలని హైకోర్టు సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల హామీలు ఏమయ్యాయి? రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలేవీ అమలు కాలేదు. ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ఇంజినీరింగ్ విద్యను "క్రిమినల్ వేస్ట్"గా అభివర్ణించడం అత్యంత భాద్యత రాహిత్యం. తెలంగాణలో చదివిన ఇంజినీర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చాటుతున్నారు. అలాంటి విద్యార్థులను అవమానించే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ తక్షణమే వారికి క్షమాపణలు చెప్పాలి. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అనేక మంది ఇంజినీరింగ్ చదివిన ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యను తక్కువ చేసి మాట్లాడటం సిగ్గుచేటు. విద్యాశాఖను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్నప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేకపోయారు. గురుకులాల్లో సమస్యలను పరిష్కరించలేకపోయారు. విద్యార్థుల మరణాలపై సమీక్షలు కూడా నిర్వహించలేదు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా వారినే అవమానించే వ్యాఖ్యలు చేస్తున్నారు అని రాకేశ్‌కుమార్ మండిపడ్డారు.
ప్రభుత్వం విమర్శలను సహించలేక ప్రతీకార రాజకీయాలు చేస్తోంది. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో పదే పదే మాట మార్చుతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. తెలంగాణ యువత, విద్యార్థులు, తల్లిదండ్రుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఎన్నికల హామీలను అమలు చేయాలి. విద్యార్థులను అవమానించే వ్యాఖ్యలు మానుకోవాలి. ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలి. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి అని రాకేష్ కుమార్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
- ●BJP OBC Morcha | బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి






