Band Melam Review | బ్యాండ్‌మేళం రివ్యూ – తెలంగాణతనం లేని తెలంగాణ సినిమా – ఆడియెన్స్‌కు బ్యాండ్ బాజా భరాత్
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ బ్యాండ్‌మేళం గురువారం థియేటర్లలో రిలీజైంది. కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించాడు.
Band Melam Review | కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ బ్యాండ్‌మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీనియర్ రైటర్ కోన వెంకట్ నిర్మించారు. టీనేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే?
బావమరదళ్ల ప్రేమకథ....
బ్రహ్మాణపల్లి ఊరి జమీందారు సుందరయ్య (గోపరాజు విజయ్) దానాలతో ఆస్తులన్నీ పొగొట్టుకొని అప్పుల పాలవుతాడు. సుందరయ్య అండతోనే అతడి బావమరది సాయన్న (సాయికుమార్) కోటీశ్వరుడిగా మారతాడు. సుందరయ్య కొడుకు గిరి(హర్ష్ రోషన్), సాయన్న కూతురు రాజీ (శ్రీదేవి)ఒకే రోజు పుడతారు. ఈ బావ మరదళ్లకు పెళ్లిచేయాలని చిన్నప్పుడే పెద్దలు అనుకుంటున్నారు. ఆస్తులన్నీ కోల్పోయిన గిరికి తన కూతురిని ఇచ్చి పెళ్లిచేసేది లేదని సాయన్న మాట మారుస్తాడు. సుందరయ్య చేసిన సాయాన్ని మర్చిపోయి అతడి కుటుంబాన్ని చిన్నచూపుచూస్తుంటాడు. టెన్త్ ఫెయిల్ అయిన గిరి ఊళ్లోనే బ్యాండ్‌మేళం నడుపుతుంటాడు. రాజీ ఇంజినీరింగ్ పూర్తిచేస్తుంది. ఓ చిన్న గొడవ కారణంగా గిరిని దూరం పెడుతుంది రాజీ. మరదలిపై ప్రేమతో ఆమె వెంట తిరుగుతుంటాడు గిరి. కానీ బావ గిరితో పాటు తండ్రి కుదిర్చిన సంబంధం కాదని తన స్నేహితుడితో లేచిపోతుంది రాజీ. ఆ తర్వాత ఏమైంది? గిరిని వెతుక్కుంటూ మళ్లీ అతడి ఇంటికే రాజీ ఎందుకొచ్చింది? మరదలి ప్రేమను గిరి అర్థం చేసుకున్నాడా? ఫోక్ సింగర్ కావాలనే గిరి కల ఫలించిందా? బావ మరదళ్లు ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
తెలంగాణ ట్రెండ్....
ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్నాయి. రియలిస్టిక్ అప్రోచ్‌తో పాటు స్వచ్ఛమైన తెలంగాణ యాస, భాషలతో ఆడియెన్స్‌కు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయడం అంటే కేవలం ఇక్కడి యాసలో డైలాగ్స్ ఒక్కటే రాసుకుంటే సరిపోదు. తెలంగాణ ప్రజల జీవన శైలి, అనుబంధాలు, ఆప్యాయతలపై అవగాహన ఉండాలి. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోవాలి. మట్టివాసనలతో సినిమా నిండిపోవాలి. ఆ స్వచ్ఛత లేకపోతే ఆడియెన్స్‌కు సినిమా కనెక్ట్ కావడం కష్టమే అవుతుంది.
బ్యాండుమేళంలో అదే జరిగింది. తెలంగాణతనం లేని తెలంగాణ సినిమాగా నిలిచింది. ఫోక్ సాంగ్స్, తెలంగాణ యాసలో ఎక్కువగా వినిపించే కొన్ని డైలాగ్స్ వాడి ....ఇదే తెలంగాణ సినిమా అని నమ్మించే ప్రయత్నం చేశారు. ట్రెండ్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు తప్పితే మేకర్స్‌లో నిజాయితీ మాత్రం కనిపించలేదు.
టీనేజ్ లవ్‌స్టోరీ...
రొటీన్ టీనేజ్ లవ్‌స్టోరీతో దర్శకుడు సతీష్ జవ్వాజి బ్యాండుమేళం సినిమాను తెరకెక్కించారు. బావ మరదళ్ల ప్రేమకథకు ఆస్తిపాస్తులు ఎలా అడ్డుగోడగా నిలిచాయి? మనస్పర్థల కారణంగా విడిపోయిన వారు ఎలా ఒక్కటయ్యారు అన్నదే ఈ మూవీ కథ. ఈ సింపుల్ పాయింట్‌ను ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ జోడించి చెప్పాలని ప్రయత్నించారు దర్శకుడు.
బ్యాండుమేళం బ్యాచ్‌తో హీరో చేసే కామెడీ అస్సలు వర్కవుట్ కాకపోగా... కొన్నిసార్లు చిరాకును తెప్పించింది. సినిమాకు కీలకమైన హీరోహీరోయిన్ల ప్రేమకథనే దర్శకుడు సరిగ్గా రాసుకోలేకపోయారు. గిరిని రాజీ ఎందుకు ద్వేషించింది, వారి మధ్య గొడవలకు కారణమేమిటి అన్నదాంట్లో లాజిక్ మిస్సయ్యింది. క్లైమాక్స్‌లో హీరోయిన్ చెప్పే ఒక్క డైలాగ్‌తో హీరో మారిపోతాడు. ఆ డైలాగ్ అప్పటివరకు సాగదీయడానికి సరైన రీజన్ కనిపించదు.
తెలంగాణ ఫోక్ సాంగ్స్...
బావమరదళ్ల మధ్య చిలిపి తగాదాలు, అలకలు, అల్లర్లలో తెలియని క్యూట్‌నెస్ దాగి ఉంటుంది. ఆ కెమిస్ట్రీపై దర్శకుడు ఏ మాత్రం ఫోకస్ పెట్టలేకపోయారు. ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డు వరకు ఒకే పాయింట్ చుట్టూ కథ సాగు...తూనే ఉంటుంది. ఒక్క ఇంచు కూడా ముందుకు కదలదు. ఫ్యామిలీ ఎమోషన్స్ సరిగ్గా రాసుకోలేదు. ఉన్నంతలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఈ సినిమాకు ఓ స్ట్రెస్ బూస్టర్‌గా నిలిచాయి.
డ్యాన్సుల్లో ఈజ్...
హర్ష్‌రోషన్, శ్రీదేవి తమ పాత్రలకు న్యాయం చేశారు. డ్యాన్సుల్లో మంచి ఈజ్ చూపించాడు హర్ష్ రోషన్. ఎమోషనల్ సీన్స్ విషయంలో ఇంకాస్త పరిణితి రావాలి. బావ ప్రేమ కోసం ఆరాటపడే అమ్మాయిగా శ్రీదేవి నటన నాచురల్‌గా ఉంది. తండ్రి పాత్రలు సాయికుమార్‌కు కొట్టిన పిండే. ఈజీగా చేసేశారు. హీరో తండ్రిగా గోపరాజు విజయ్ సెటైర్స్ నవ్వించాయి. హీరో గ్యాంగ్ చేసే అల్లరి కొన్ని చోట్ల నవ్వించింది.
విజయ్ బుల్గానిన్ పాటలు పర్వాలేదనిపిస్తాయి.
బ్యాండ్‌మేళం...ఓపికకు పరీక్ష పెట్టే టీనేజ్ లవ్‌స్టోరీ. ఈసినిమా చూడటానికి థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్‌కు బ్యాండ్ బాజా భరాత్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Samantha | మా ఇంటి బంగారంతో నిర్మాతల కష్టమేంటో తెలిసింది – సమంత కామెంట్స్
జూన్ 16, 2026

Preity Mukhundhan | విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న మలయాళ బ్యూటీ – రౌడీ జనార్దనలో స్పెషల్ సాంగ్!
మే 26, 2026

Tollywood | జీవోలు తెచ్చినా సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను పెంచం – తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం
మే 12, 2026
తాజావార్తలు
- ●Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Horoscope | జూలై 6 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?



