Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?
Tiger | పెద్ద పులులు( Tiger ) అంటేనే గుండెల్లో వణుకు పుడుతుంది.. మరి అది ఆకస్మాత్తుగా కనిపిస్తే గుండె ఆగిపోవాల్సిందే.. అలాంటి సన్నివేశమే ఇది. వే
Viral news | Published On Aug 4, 2026, 7.13 am IST
Tiger | త్రినేత్ర.న్యూస్ : పెద్ద పులులు( Tiger ) అంటేనే గుండెల్లో వణుకు పుడుతుంది.. మరి అది ఆకస్మాత్తుగా కనిపిస్తే గుండె ఆగిపోవాల్సిందే.. అలాంటి సన్నివేశమే ఇది. వేగంగా దూసుకువస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడికి.. నడిరోడ్డుపై పెద్ద పులి ప్రత్యక్షమైంది. ఇంకేముంది.. బైక్‌ను ఆకస్మాత్తుగా ఆపేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే..?
అది మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా.. తడోబా - అంధేరి టైగర్ రిజర్వ్. ఆ ప్రాంతంలోని మొహర్లీ రహదారి మీదుగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఓ పెద్ద పులి ఆకస్మాత్తుగా రహదారిపై ప్రత్యక్షమైంది. దాదాపు రెండు నిమిషాలకు పైగా నడిరోడ్డుపై పులి ఉండిపోయింది. ఇక రెండు పులి పిల్లలు కూడా దానిని అనుసరించాయి.
అయితే మొహర్లీ రహదారి టైగర్ రిజర్వ్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ రోడ్డుపై ఓ బైకర్ అతి వేగంగా దూసుకువస్తున్నాడు. నడిరోడ్డుపై రాజసంగా సేద తీరుతున్న పెద్ద పులిని చూసి అతను షాకయ్యాడు. బైక్‌ను ఆపేశాడు.. నెమ్మదిగా వెనక్కి మళ్లించాడు. ముందుకు వచ్చే సాహసం చేయలేక అటు నుంచే అటే వెనుతిరిగాడు.
నడిరోడ్డుపై పులి ఉండడంతో కాసేపు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఈ దృశ్యాలను కారులో ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండి..
Tadoba, 7:03 PM. 🐅
A family driving back from a quiet safari suddenly sees tall grass move, just metres from their car.
Out steps Chhoti Madhu - one of Tadoba's most loved tigresses.
Then her first cub follows. Then a second. Then a third.
A biker, unaware, is riding… pic.twitter.com/2XBwHHoyVA
— Rajneeti Tadka 🌶️ 🔥 (@RajneetiTadka) July 31, 2026
తాజావార్తలు
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
- ●Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం






