Hormuz opens for India | హర్మూజ్‌లో భారత నౌకలపై ఎలాంటి ఆంక్షల్లేవ్.. ఇరాన్ కీలక ప్రకటన
Hormuz opens for India | మధ్యప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ ఇరాన్ శుభవార్త చెప్పింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే భారత్ (India) సహా ఐదు మిత్ర దేశాల నౌకలపై ఎలాంటి ఆంక్షలు (Hormuz opens for India) విధించబోమని ప్రకటించింది.
Hormuz opens for India | మధ్యప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ ఇరాన్ శుభవార్త చెప్పింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే భారత్ (India) సహా ఐదు మిత్ర దేశాల నౌకలపై ఎలాంటి ఆంక్షలు (Hormuz opens for India) విధించబోమని ప్రకటించింది. ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ తెలిపినట్లు కాన్సులేట్ పేర్కొంది. ఇరాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు కలిగిన పలు దేశాలకు చెందిన నౌకలను ఈ జలసంధిలో సురక్షిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్ దేశాలకు చెందిన నౌకలు ఈ జలసంధి గుండా సురక్షితంగా వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు ఈ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఇరాన్ కొట్టిపారేసింది. జలసంధి గుండా తమ నౌకలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని అనేక దేశాలు తమను సంప్రదిస్తున్నాయని పేర్కొంది. తాము స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలకు చెందిన నౌకలకు తమ సాయుధ దళాలు సురక్షితమైన మార్గాన్ని కల్పించినట్లు వెల్లడించింది.
Also Read..
పద్మానదిలో పడిన బస్సు.. 23 మంది దుర్మరణం.. వీడియో
బ్యాండ్‌మేళం రివ్యూ - తెలంగాణతనం లేని తెలంగాణ సినిమా - ఆడియెన్స్‌కు బ్యాండ్ బాజా భరాత్
నేటి నుంచి అందుబాటులోకి సన్‌రైజర్స్ మ్యాచ్‌ల టికెట్లు.. రెండు కొంటే జెర్సీ ఫ్రీ
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●IPL 2027 | ఐపీఎల్లో 12 జట్లు.. ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు.. బీసీసీఐ కీలక ప్రకటన
- ●Punjagutta AI Police Station | దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట: ఫిర్యాదు మొదలు ఛార్జ్‌షీట్ దాకా అంతా కృత్రిమ మేధతోనే
- ●Poonam Kaur | పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై పూనమ్ కౌర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Jensen Huang Alice Huang Controversy | 'హమ్ చిప్ దే చుకే సనమ్'.. ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్‌పై బాలీవుడ్ ఏఐ మీమ్స్ వర్షం
- ●Gold Price | బంగారం ధరలకు మళ్లీ బ్రేక్.. ఒక్కరోజే రూ.800 డౌన్.. వెండి రూ.5వేలు పతనం
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

IPL 2027 | ఐపీఎల్లో 12 జట్లు.. ఇప్పట్లో ఆ ఆలోచనే లేదు.. బీసీసీఐ కీలక ప్రకటన

Punjagutta AI Police Station | దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట: ఫిర్యాదు మొదలు ఛార్జ్‌షీట్ దాకా అంతా కృత్రిమ మేధతోనే

Poonam Kaur | పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై పూనమ్ కౌర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు

Jensen Huang Alice Huang Controversy | 'హమ్ చిప్ దే చుకే సనమ్'.. ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్‌పై బాలీవుడ్ ఏఐ మీమ్స్ వర్షం






