Bus Accident | టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 13 మంది మృతి
Bus Accident | ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం (Markapuram) జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) జరిగింది. గురువారం ఉదయం రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.
Bus Accident | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం (Markapuram) జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) జరిగింది. గురువారం ఉదయం రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతోపాటు టిప్పర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు మొత్తానికి మంటలు వేగంగా వ్యాపించడంతో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు దవాఖానలో చికిత్స పొందుతు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

బస్సు జగిత్యాల నుంచి కనిగిరి వెళ్తుండగా ఉదయం 6.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. పలకల క్వారీల వద్ద బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ ఢీకొట్టినట్లు తెలుస్తున్నది. టిప్పర్ అతివేగమే ఘటనకు కారణమని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.

వీరిలో బస్సు వెనుక భాగంలో ఉన్నవారు మృతిచెందినట్లు తెలుస్తున్నది. ముందుభాగంలో ఉన్నవారు సుమారు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన ప్రయాణికులను స్థానిక దవాఖానకు తరలించారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమయింది. ప్రమాదానికి సంబంధించిన కారణాలను ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
- ●Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?

Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు






