HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్
HMWSSB | హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాపై జలమండలి( HMWSSB ) కీలక ప్రకటన చేసింది. కలబ్‌గుర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ మరమ్మతుల పనుల విషయంలో ఈ నెల 5న హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
HMWSSB | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాపై జలమండలి( HMWSSB ) కీలక ప్రకటన చేసింది. కలబ్‌గుర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ మరమ్మతుల పనుల విషయంలో ఈ నెల 5న హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు ఏరియాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించింది.
ప్రభావిత ప్రాంతాలు ఇవే..
రామచంద్రాపురం, అశోక్‌నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట్, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ, బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్, హెచ్‌సీవైతో పాటు తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
ఈ క్రమంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు.. తాగునీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి సూచించింది. సరిపోయినంత నీటిని ఇవాళ పట్టుకోవాలని తెలిపింది. విద్యుత్ పనుల అనంతరం తాగునీటి సరఫరా చేస్తామని పేర్కొంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ
- ●HIPLEX 2026 | సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..
- ●'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?
- ●Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
- ●POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు

Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు

CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

HIPLEX 2026 | సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..

'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?






