Bangladesh | పద్మానదిలో పడిన బస్సు.. 23 మంది దుర్మరణం.. వీడియో
Bangladesh | బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌బరి జిల్లాలోని దౌలడియా టెర్మినల్ (Dauladia terminal) వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి (Padma River) దూసుకెళ్లింది. దీంతో 23 మంది జలసమాధి అయ్యారు.
International | Published On Mar 26, 2026, 9.31 am IST
Bangladesh | త్రినేత్ర.న్యూస్: బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌బరి జిల్లాలోని దౌలడియా టెర్మినల్ (Dauladia terminal) వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి (Padma River) దూసుకెళ్లింది. దీంతో 23 మంది జలసమాధి అయ్యారు. పలువురు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. బుధవారం సాయంత్రం 5.15 గంటల సమయంలో బస్సు ఫెర్రీ ఎక్కే సమయంలో నదిలో పడిపోయిందని అధికారులు చెప్పారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గత అర్ధరాత్రి భారీక్రేన్ల సహాయంతో బస్సును నదిలో నుంచి బయటకు తీశారు. బస్సులోనే 14 మంది ప్రయాణికుల మృతదేహాలు లభించాయని చెప్పారు. మరో 11 మంది నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారికోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. రంజాన్ పండుగ ముగించుకుని రాజధాని ఢాకా వేళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం.
https://x.com/KantInEastt/status/2036874279900569631
https://x.com/KantInEastt/status/2037009790283767831
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు.
https://x.com/DDNewslive/status/2036842267810652185
సంబంధిత వార్తలు

Sheikh Hasina | డిసెంబర్లో స్వదేశానికి.. లొంగిపోయేందుకు సిద్ధం : షేక్ హసీనా కీలక ప్రకటన
జులై 10, 2026

Street Dog | అమానవీయ ఘటన.. కుక్కమెడకు ఇటుక కట్టి.. నదిలోకి తోసేశారు
జూన్ 29, 2026

Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?

Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు



