Bandi Sanjay | కుమారుడిపై పోక్సో కేసు.. బండి సంజయ్ ఏమన్నారంటే?
Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడిపై పోక్సో కేసు నమోదయింది. 17 ఏండ్ల బాలికకు మద్యం తాగించి రెండు సార్లు బలాత్కారం చేశాడు. దీంతో ఆమె రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది.
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడిపై పోక్సో కేసు నమోదయింది. 17 ఏండ్ల బాలికకు మద్యం తాగించి రెండు సార్లు బలాత్కారం చేశాడు. దీంతో ఆమె రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లిదండ్రులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా బండి సంజయ్ (Bandi Sanjay) ఎక్స్ వేదికగా స్పందించారు.
‘ఇటీవల నిరాధారమైన ఆరోపణల దృష్ట్యా.. నా ప్రజా జీవితమంతటా నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలియజేయాలనుకుంటున్నా. నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నా.పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది.. నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను మాత్రమే ప్రతిబింబిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి వచ్చి, కార్పొరేటర్‌గా పనిచేసి, కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు.. నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టమవుతున్నది. ఏది సరైనదో, ఏది తప్పో న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది. ప్రతి కుట్రను బయటపెడుతుంది. సత్యమేవ జయతే’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్‌విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు.
Read Also..
పదవి ఉండేనా? ఊడేనా? కొడుకు ప్రేమాయణం..! తండ్రికి తీవ్ర సంకటం..!!
పోలీస్ స్టేషన్ వద్దే 8 గంటలు.. పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన బండి సంజయ్..!
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
- ●WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
- ●woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
- ●Vemula Prashanth Reddy | ఇప్పటికైనా మొండి పట్టు వీడండి.. కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోసి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- ●ITR | ఐటీఆర్‌లో కొత్త సెక్షన్.. పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పు..
- ●Encounter | 11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు హతం

Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..

woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..

Vemula Prashanth Reddy | ఇప్పటికైనా మొండి పట్టు వీడండి.. కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోసి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి






