Bandi Sai Bhagirath | పోలీస్ స్టేషన్ వద్దే 8 గంటలు.. పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన బండి సంజయ్..!
Bandi Sai Bhagirath | తన కుమారుడిపై పోక్సో కేసు నమోదు కాకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చివరి క్షణం వరకు ప్రయత్నించారని తెలుస్తున్నది. తనను ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించాలని పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ..బండి సంజయ్ ఫోన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఉదయం నుంచి ఠాణా వద్దే
బాధితురాలు, ఆమె తల్లి
ఫిర్యాదు తీసుకునేందుకు
వెనకాడిన పోలీసులు
కరీంనగర్ లో బండి ఫిర్యాదు తీసుకున్న తర్వాతే
పేట్ బషీరాబాద్‌లో అర్ధరాత్రి పోక్సో కేసు
మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించిన బండి సంజయ్
అయినా ఒప్పుకోని బాలిక తల్లిదండ్రులు
పలుమార్లు సీఎంకు ఫోన్ చేసిన సంజయ్
Bandi Sai Bhagirath | త్రినేత్ర.న్యూస్ : తన కుమారుడిపై పోక్సో కేసు నమోదు కాకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చివరి క్షణం వరకు ప్రయత్నించారని తెలుస్తున్నది. తనను ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించాలని పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ..బండి సంజయ్ ఫోన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో కేసు కాకుండా మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించినా బాలిక తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. అయితే.. బాధితురాలైన బాలిక, ఆమె తల్లి.. ఉదయం నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినా దాదాపు అర్ధరాత్రి వరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇంతలోపే అంటే... పోక్సో కేసు నమోదయ్యే కన్నా కొన్ని గంటల ముందే బాధితురాలైన బాలికపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
కేసు విత్ డ్రా చేసుకోండి
మే 8, శుక్రవారం ఉదయం బాధితురాలైన బాలిక, ఆమె తల్లి ఫార్చూనర్ కారులో పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. మైనర్ బాలిక అయిన తమ కుమార్తెను బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ డిసెంబర్ 31న మొయినాబాద్‌లో ఆ తర్వాత మరో రెండు చోట్ల లొంగబరుచుకొని లైంగిక దాడి చేశారంటూ.. సాక్ష్యాలతో సహా బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు సమర్పించారు. ఈ లోపు ఈ సమాచారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు చేరింది. దీంతో ఆయన మధ్య వర్తిత్వం కోసం ప్రయత్నించగా బాలిక తల్లి ఒప్పుకోలేదు. ఇదే సమయంలో పోలీసులు ఈ ఫిర్యాదు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కించారు. రకరకాల కారణాలు చెబుతూ.. ఫిర్యాదు తీసుకోలేదు. జరిగిందేదో జరిగి పోయిందంటూ కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కేసు నమోదు చేయకుండా ఉండేందుకు బండి సంజయ్ ... సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్ కు ఫోన్ చేశారు. అయితే.. ఫిర్యాదు స్వీకరించకపోతే.. తాము పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరగబోయే మోదీ సభలో ఆత్మార్పణ చేసుకుంటామంటూ బాలిక, బాలిక తల్లిదండ్రులు హెచ్చరించడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
స్టేషన్ బెయిల్ వచ్చేలా
మైనర్ బాలిక విషయంలో పేట్ బషీరాబాద్ లో కేసు నమోదు చేసేందుకు అర్ధరాత్రి వరకు పోలీసులు తాత్సారం చేస్తే.. అటు కరీంనగర్‌లో మాత్రం ఆగమేఘాల మీద బాధితురాలిపై రివర్స్ కేసు పెట్టారు. లైంగిక దాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినా.. బండి సాయి భగీరథ్ కు ఇబ్బంది కలగకుండా స్టేషన్ బెయిల్ వచ్చేలా కేసులు నమోదు చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | ఈ విషయం 30 ఏండ్ల ముందే తెలిసుంటే ఐపీఎస్‌లో చేరేవాన్ని కాదేమో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
జులై 8, 2026

Uttam Kumar Reddy | తుమ్మిడిహెట్టి పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 8, 2026

KTR | ఆయిల్ పామ్ రైతులతో ముచ్చటించిన కేటీఆర్.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ..
జులై 7, 2026
తాజావార్తలు
- ●Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..
- ●Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు
- ●Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం
- ●Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..

Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు

Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం

Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం



