Bandi Sanjay | పదవి ఉండేనా? ఊడేనా? కొడుకు ప్రేమాయణం..! తండ్రికి తీవ్ర సంకటం..!!
Bandi Sanjay | కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగుతుందని.. భావం. కానీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు పుత్రుడి విషయంలో ఇప్పుడంతా రివర్స్‌లో జరుగుతున్నది. కుమారుడు చేష్టలే వ్యక్తిగతంగా బండి సంజయ్‌కు చెరిపివేయలేని మచ్చను తెస్తున్నాయి. ఇప్పుడు పోక్సో కేసు విచారణలో విషయాలన్నీ నిజమేనని తేలితే.. ఏకంగా ఆయన పదవికే గండం ఏర్పడే ప్రమాదం దాపురించింది.
రాజకీయాల్లో ఒక్కో మెట్టు
ఎక్కుతూ వచ్చిన బండి సంజయ్
1996 నుంచి ఏబీవీపీ కార్యకర్తగా
20 ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో
పార్టీకి విశ్వాస పాత్రుడిగా ముద్ర
అంచెలంచెలుగా ..కేంద్రమంత్రి వరకు ఎదిగి
తండ్రి ప్రతిష్టకు మచ్చ తెచ్చిన కుమారుడు
కొన్నాళ్లుగా వెంటాడుతున్న ప్రేమ వ్యవహారం
డైవర్షన్ కోసమే కరీంనగర్‌లో అటాక్ పాలిటిక్స్
త్రినేత్ర.న్యూస్ :
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు
జనులా పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహము నాడు పొందుర సుమతీ !
అని సుమతీ శతకం బోధిస్తున్నది. కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగుతుందని.. భావం. కానీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు పుత్రుడి విషయంలో ఇప్పుడంతా రివర్స్‌లో జరుగుతున్నది. కుమారుడు చేష్టలే వ్యక్తిగతంగా బండి సంజయ్‌కు చెరిపివేయలేని మచ్చను తెస్తున్నాయి. ఇప్పుడు పోక్సో కేసు విచారణలో విషయాలన్నీ నిజమేనని తేలితే.. ఏకంగా ఆయన పదవికే గండం ఏర్పడే ప్రమాదం దాపురించింది.
అసలైన సంఘ్ కార్యకర్త
బండి సంజయ్.. పరిచయం అవసరం లేని కరడుగట్టిన కాషాయవాది. బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్ భావాలను పుణికిపుచ్చుకున్న హైందవవాది. కళాశాల రోజుల్లో 1996 నుంచే ఏబీవీపీ నేతగా వ్యవహరించారు. 2005లో కరీంనగర్‌లో 48వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండుసార్లు కరీంనగర్ శాసనసభ స్థానానికి పోటీ చేసినా.. గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. కానీ 2019, 2024లో రెండుసార్లు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
అత్యంత విశ్వాస పాత్రుడు
బీజేపీ పార్టీలో అగ్ర నాయకత్వానికి బండి సంజయ్ అత్యంత విశ్వాస పాత్రుడిగా పేరు పొందారు. ఏనాడూ ఆయన పార్టీ లైన్ దాటరని ప్రతీతి. తెలంగాణ పార్టీ చీఫ్‌గా బండి పగ్గాలు చేపట్టిన తర్వాతే.. రాష్ట్ర బీజేపీలో నవశకం మొదలైందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తుంటారు. ఆయన పార్టీ చీఫ్‌గా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి దీటుగా పోరాటాలు సాగాయి.
కుమారుడితో తిప్పలు
బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ .. అతి తక్కువ సమయంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. మహీంద్ర యూనివర్సిటీలో జూనియర్లను ర్యాగింగ్ చేసి నానా దుర్భాషలాడి భౌతిక దాడులకు పాల్పడ్డాడు. ఢిల్లీలోని ఓ విద్యా సంస్థలో కూడా గొడవలకు దిగితే.. ఆ విద్యా సంస్థ నుంచి భగీరథ్‌ను సస్పెండ్ చేశారు.
ఇదంతా ముందే తెలిసినా..
కుమారుడి వ్యవహారమంతా కొన్ని రోజుల క్రితమే బండి సంజయ్‌కు తెలిసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులను బెదిరించేందుకు, మభ్య పెట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఏదీ కుదరక.. కేసు సెటిల్ చేసుకునేందుకు మధ్యవర్తిత్వానికి కూడా యత్నించారు. కాగా, ఇదే సమయంలో బండి సంజయ్ అటెన్షన్ డైవర్షన్‌కు యత్నించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా.. ఆయన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీసుపై.. తన అనుచరులతో దాడి చేయించారు. కుమారుడి కేసు విషయంలో తలమునకలై ఉన్న బండి సంజయ్.. అటెన్షన్ డైవర్షన్ కోసమే బీఆర్ఎస్‌పై దాడికి దిగినట్టు.. కరీంనగర్ రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే కుమారుడి పోక్సో వ్యవహారంలో.. నిందలు నిజమైతే.. బండి మంత్రి పదవికి గండం తప్పదేమోనని విశ్లేషిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..
- ●Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు
- ●Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం
- ●Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..

Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు

Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం

Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం






