త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొద‌టి ద‌శ‌లో 21 కి.మీ ప‌నులు

Musi | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఫేజ్-1)కు మంత్రివర్గం రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసింది. జోన్-1ఏ, జోన్-1బీ ప్రాధాన్య కారిడార్లలో మూసీ అభివృద్ధి పనులు చేప‌ట్ట‌నున్నారు.

S

Hyderabad | Published On Jul 9, 2026, 2.03 pm IST

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొద‌టి ద‌శ‌లో 21 కి.మీ ప‌నులు
Advertisement

Musi | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఫేజ్-1)కు మంత్రివర్గం రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసింది. లండన్‌లోని థేమ్స్ నది తరహాలో మూసీని సుందరీకరించేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జోన్-1ఏ, జోన్-1బీ ప్రాధాన్య కారిడార్లలో మూసీ అభివృద్ధి పనులు చేప‌ట్ట‌నున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కి.మీ, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కి. మీ మేర‌ అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌నున్నాయి. మొదటి దశలో నదికి ఇరువైపులా 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

భూసేకరణ వ్యయం మినహా రూ.7,345.12 కోట్లకు అనుమతులొచ్చాయి. ఏడీబీ నుంచి రూ.4,500 కోట్ల రుణంతో ప్రాజెక్టు, మిగతా రూ.2,845.12 కోట్లకు HMDA/TGIIC రుణం తీసుకోనున్నారు. EPC విధానంలో మూసీ రివర్‌ఫ్రంట్ పనులు జ‌ర‌గ‌నున్నాయి. ప్రాజెక్టు పర్యవేక్షణకు PMC నియామకానికి ఆమోదం ల‌భించింది. ADB మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు ప్రొక్యూర్‌మెంట్, MRDCLకు తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement