Congress Party | 28లోగా ఆ రెండు బంగ్లాలను ఖాళీ చేయండి.. కాంగ్రెస్ పార్టీకి కేంద్రం నోటీసులు
Congress Party | కాంగ్రెస్ పార్టీకి (Congress Party) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలోని రెండు ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను తక్షణమే ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు (Eviction notices) జారీచేసింది.
Congress Party | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ పార్టీకి (Congress Party) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలోని రెండు ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను తక్షణమే ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు (Eviction notices) జారీచేసింది. కార్యాలయాల తరలింపునకు ఈ నెల 28 వరకు గడువు ఇచ్చింది. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులోని ఓ బంగ్లాలో (24 Akbar Road) కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కొనసాగుతున్నది. అదేవిధంగా 5 రైసినా రోడ్డులో మరో కీలక ప్రాంగణంలో (5 Raisina Road) పార్టీ కార్యాలయం ఉన్నది. ఈ రెండింటిని మార్చి 28వ తేదీ నాటికి ఖాళీ చేయాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. దీనిని పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ధృవీకరించారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వాల్ మధ్య ఉద్రిక్తతకు దారితీసింది.
కాగా, కొన్ని రోజుల క్రితమే తమకు నోటీసులు అందాయని, గతంలో కంటే మరింత దూకుడుగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఆ నాయకుడు విమర్శించారు. తమ ముందున్న చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యత కలిసిన ఈ రెండు ప్రాంతాలపై నియంత్రణ కోల్పోనుండటం పట్ల పార్టీ అధినాయకత్వం సీరియస్‌గా ఉన్నదని తెలిపారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడమా లేదా, ప్రభుత్వాన్ని మరింత గడువు కోరడమా అనే విషయాన్ని పరిశీలిస్తున్నదని చెప్పారు. సీనియర్ రాజ్యసభ సభ్యుడికి ఆ బంగ్లాని వారికి కేటాయించాలా చూసుకోవాలని ఆలోచిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీతో 5 దశాబ్దాల అనుబంధం..
24 అక్బర్ రోడ్డులోని భవంతితో కాంగ్రెస్ పార్టీకి 5 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్నది. 1978 నుంచి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తున్నది. ఇది ఢిల్లీలోని పాలనా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉంది. ల్యూటెన్స్ ఢిల్లీగా వ్యవహరించే ఈ ప్రాంతంలో పాలనా భవనాలతో పాటు పాలకులు, ఉన్నతాధికారుల నివాస భవనాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఓ ప్రభుత్వ బంగ్లాను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా మార్చుకుని ఉపయోగించుకుంటున్నది.
అయితే 130 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యాలయం నేటి ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్)లో ఉండేది. దాన్ని స్వరాజ్ భవన్‌గా వ్యవహరించేవారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి న్యూఢిల్లీ నగరాన్ని రాజధానిగా ఎంచుకున్న తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో 7, జంతర్ మంతర్ భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చుకుంది. 1969లో పార్టీలో చీలక రాగా, ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ తాత్కాలిక భవనాల్లో కొన్నాళ్లు పార్టీని నడిపి చివరకు ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఓటమి అనంతరం 1978లో 24, అక్బర్ రోడ్ బంగ్లాను పార్టీ ప్రధాన కార్యాలయంగా మార్చుకుంది. అప్పటి నుంచి ఈ బంగ్లాయే ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌గా సేవలందించింది. అయితే గతేడాది జనవరిలో ఇక్కడి నుంచి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఇందిరాభనక్‌కు మార్చారు. అయితే చిరుమానా మాత్రం 24 అక్బర్ రోడ్డులోని బిల్డింగ్‌నే పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయ భవనం నిర్మించింది దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోనే కావడంతో దాని చిరునామా కూడా అదే అవుతుంది. అయితే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి నేత పేరు మీద ఉన్న చిరునామాలో కాంగ్రెస్ పార్టీ ఉండడాన్ని ఆ పార్టీ ఇష్టపడినట్టు లేదు. అందుకే వెనుక ద్వారం కోట్లా మార్గ్‌లో ఉంటుంది. వెనుక ద్వారమే ప్రధాన ద్వారంగా మార్చుకుంటే.. 9A, కోట్లా మార్గ్ ఇప్పుడు ఆ భవంతికి అధికారిక చిరునామాగా మారుతుంది. దాంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే ఏఐసీసీ కార్యాలయం చిరునామా రాసుకునే వెసులుబాటు ఏర్పడింది. తాజాగా ఈ బిల్డింగ్‌ను ఖాళీ చేయాలని కేంద్రం నోటీసులు జారీచేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లో పడింది.
సంబంధిత వార్తలు

Konda Surekha | కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి… పీసీసీ చీఫ్ మహేశ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
జులై 9, 2026

Koppula Eshwar | తాడిచర్ల బ్లాక్‌ను సింగరేణియే గుర్తించింది.. కాంగ్రెస్, బీజేపీలు గొప్పలు చెప్తుంటే నవ్వొస్తుంది
జులై 9, 2026

Chamala Kiran Kumar Reddy | పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే.. ప్రజల్లో చులకనౌతాం: ఎంపీ చామల
జులై 9, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | గ్రామసభలతో ఎల్నీనోపై చైతన్యం కల్పించండి
- ●Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం - డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్
- ●Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!
- ●Rakesh Reddy | ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బొంద పెట్టే ప్రయత్నం : రాకేశ్ రెడ్డి
- ●Supreme Court | ఏం చర్యలు తీసుకున్నారు..? ఢిల్లీ, లక్నో అగ్నిప్రమాదాలపై అధికారులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
- ●Vakiti Srihari | క్రీడల్లో ఎందుకు వెనకబడ్డమో యువత ఆలోచించాలి

Uttam Kumar Reddy | గ్రామసభలతో ఎల్నీనోపై చైతన్యం కల్పించండి

Rashmika Mandanna | మైసా కోసం నేషనల్ క్రష్ సాహసం - డూప్ లేకుండా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్

Rain Alert | మరో 2 గంటల్లో వర్షం.. హైదరాబాదీలారా జర జాగ్రత్త..!

Rakesh Reddy | ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బొంద పెట్టే ప్రయత్నం : రాకేశ్ రెడ్డి



