Ebola | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా కలకలం
Ebola | శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో ప్రాణాంతక ఎబోలా వైరస్ (Ebola) కలకలం సృష్టించింది. ఎబోలా హిస్టరీ ఉన్న సుడాన్ దేశస్థుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.
Ebola | శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో ప్రాణాంతక ఎబోలా వైరస్ (Ebola) కలకలం సృష్టించింది. ఎబోలా హిస్టరీ ఉన్న సుడాన్ దేశస్థుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అక్కడ స్క్రీనింగ్ సమయంలో సుడాన్ దేశస్థుడు (Sudanese national) మహమ్మద్‌కు గతంలో ఎబోలా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు అతడిని అట్నుంచి అటే వెనక్కి పంపించేశారు.
ఆఫ్రికాలోని కాంగో (Congo), ఉగాండా (Uganda) సహా పలు దేశాల్లో ప్రాణాంతక వైరస్ ఎబోలా (Ebola) వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు కీలక అడ్వైజరీ జారీ చేసింది (Govt Issues Ebola Warning). అన్ని ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో ఎబోలా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు చేస్తోంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న సుడాన్, కాంగో, ఉగాండా నుంచి తెలంగాణకు వచ్చే వారికి ఎయిర్‌పోర్టులోనే టెస్టులు చేస్తోంది. వైరస్ లక్షణాలు, ఆ హిస్టరీ ఉన్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా సుడాన్ దేశస్థుడిని గుర్తించి వెనక్కి పంపింది.
ఎబోలాపై కేంద్రం కీలక అడ్వైజరీ
మన దేశంలో ప్రస్తుతం ఎలాంటి ఎబోలా కేసులూ నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించిన వారు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
“మీరు గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశం నుంచి వచ్చినా లేదా ఆ దేశం మీదుగా ప్రయాణించినా.. ఒకవేళ మీకు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా ఎలాంటి కారణం లేకుండా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోండి. అంతేకాదు, వెంటనే ఆరోగ్య అధికారులకు సమాచారం అందించండి. ముందుగానే సమాచారం అందించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాధి వ్యాప్తిని అరికట్టొచ్చు” అని మంత్రిత్వ శాఖ అడ్వైజరీలో తెలిపింది. సహాయం కోసం 1075 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.
Also Read..
తీవ్ర అస్థిరతలో బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన ఫ్యూచర్స్..
చార్‌ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
మైక్రోసాఫ్ట్ ఆటోపైలట్స్ ఎంట్రీ.. మీ తరఫున పని చేసే ఏఐ ఏజెంట్ వచ్చేసింది..
తాజావార్తలు
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు






