Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్‌మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
జర్మనీలో హెల్త్‌కేర్ సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో వివరిస్తూ ఓ భారతీయ మహిళ చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. కంటి ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రికి వెళ్తే ఏమైందంటే?
Viral news | Published On Jul 26, 2026, 1.00 am IST
- జర్మనీలో వైద్య సేవలు పొందడం ఎంత కష్టమో వివరిస్తూ సిమ్రాన్ కౌల్ అరోరా అనే భారతీయ మహిళ చేసిన వీడియో వైరల్
- భర్తకు కంటి ఇన్ఫెక్షన్ వస్తే, డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరకడానికి ఏకంగా వారం రోజులు పట్టిందంటూ ఆమె ఆవేదన
- భారీగా పన్నులు, ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నా సరైన వైద్యం సకాలంలో అందడం లేదని పెదవి విరుపు
- ఇండియాలో కేవలం రూ.5 కే ప్రభుత్వ ఆస్పత్రిలో ఫాస్ట్‌గా వైద్యం అందుతోందంటూ నెటిజన్ల కామెంట్స్
Healthcare in Germany | త్రినేత్ర.న్యూస్ : అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్య సదుపాయాలు (Healthcare facilities) అద్భుతంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా జర్మనీ లాంటి దేశాల్లో హెల్త్‌కేర్ సిస్టమ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందని ఊహిస్తారు. కానీ, అక్కడ వాస్తవ పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కడుతూ సిమ్రాన్ కౌల్ అరోరా అనే భారతీయ మహిళ (Indian woman) ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కంటి ఇన్ఫెక్షన్‌తో వెళ్తే
"జర్మనీలో వైద్యం కోసం వెళితే ఏమైంది?" అనే టైటిల్‌తో సిమ్రాన్ ఈ వీడియోను షేర్ చేశారు. తన భర్త శివమ్‌కు కంటి ఇన్ఫెక్షన్ (Eye infection) రావడంతో వారు పడిన ఇబ్బందులను అందులో వివరించారు. "జర్మనీకి రాకముందు ఇక్కడి హెల్త్‌కేర్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా ఉంటుందని భావించాను. కానీ ఇక్కడి పరిస్థితి నా అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంది. డాక్టర్‌ను నేరుగా కలవడం అంత ఈజీ కాదని ఇక్కడికి వచ్చాకే తెలిసింది" అని సిమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వారం తర్వాత అపాయింట్‌మెంట్.. తీరా వెళ్తే ఎదురుచూపులు
కంటి సమస్యతో ముందుగా ఎమర్జెన్సీ రూమ్ (Emergency room) కు వెళ్లామని, కానీ వాళ్లు తమ ఇంటికి గంట దూరంలో ఉన్న మరో ఆస్పత్రికి వెళ్లాలని సూచించారని ఆమె తెలిపారు. తీరా అక్కడికి వెళ్తే.. వారం రోజుల తర్వాత డాక్టర్ అపాయింట్‌మెంట్ (Doctor's appointment) ఇచ్చారని వాపోయారు. భారీగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు (Insurance premiums), ట్యాక్సులు కడుతున్నప్పటికీ.. అపాయింట్‌మెంట్ దొరకడమే గగనంగా మారిందన్నారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ దొరికిన రోజు వెళ్లినా.. ఆస్పత్రిలో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని ఆమె తన వీడియోలో పేర్కొన్నారు.
ఇండియానే బెస్ట్ అంటున్న నెటిజన్లు
ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు ఇండియాలోని వైద్య సదుపాయాలతో జర్మనీని పోలుస్తున్నారు.
"ఇలాంటి సమయాల్లోనే ఇండియా (India) చాలా గుర్తొస్తుంది" అని ఒకరు కామెంట్ చేశారు.
మరొకరు "బీహార్‌లోని పాట్నా ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే కేవలం రూ.5 రిజిస్ట్రేషన్ ఫీజుతో 15 నిమిషాల్లో డాక్టర్‌ను కలిశాను, ఉచిత మందులు కూడా ఇచ్చారు. అది చాలా ఫాస్ట్‌గా అయిపోయింది" అని తమ అనుభవాన్ని పంచుకున్నారు.
ప్రపంచంలోనే అత్యంత సులభంగా వైద్యం అందే దేశాల్లో ఇండియా ఒకటని.. మన దేశంలో రోగులు అడిగిన వెంటనే ఒకే రోజులో వైద్యం అందుతుందని, కానీ తీవ్ర ఒత్తిడిలో పనిచేసే డాక్టర్లపై దాడులు జరగడం బాధాకరమని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
View this post on Instagram
తాజావార్తలు
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!



