త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Microsoft Auto Pilots | మైక్రోసాఫ్ట్ ఆటోపైలట్స్ ఎంట్రీ.. మీ తరఫున పని చేసే ఏఐ ఏజెంట్ వచ్చేసింది..

Microsoft Auto Pilots | టెక్ దిగ్గ‌జ సంస్థ‌ మైక్రోసాఫ్ట్ కొత్త తరహా ఏఐ ఏజెంట్లను ఆటోపైలట్స్ పేరుతో ప్రకటించింది. ఇవి యూజర్లు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం పనిచేస్తూ వారి తరఫున పనులను నిర్వహించేలా డిజైన్ అయ్యాయి. ఈ కొత్త విభాగంలో భాగంగా కంపెనీ తన తొలి ఆటోపైలట్ ఏజెంట్ మైక్రోసాఫ్ట్ స్కౌట్ ను కూడా పరిచయం చేసింది.

S

Technology | Published On Jun 4, 2026, 10.45 am IST

Microsoft Auto Pilots | మైక్రోసాఫ్ట్ ఆటోపైలట్స్ ఎంట్రీ.. మీ తరఫున పని చేసే ఏఐ ఏజెంట్ వచ్చేసింది..
Advertisement

Microsoft Auto Pilots | టెక్ దిగ్గ‌జ సంస్థ‌ మైక్రోసాఫ్ట్ కొత్త తరహా ఏఐ ఏజెంట్లను ఆటోపైలట్స్ పేరుతో ప్రకటించింది. ఇవి యూజర్లు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం పనిచేస్తూ వారి తరఫున పనులను నిర్వహించేలా డిజైన్ అయ్యాయి. ఈ కొత్త విభాగంలో భాగంగా కంపెనీ తన తొలి ఆటోపైలట్ ఏజెంట్ మైక్రోసాఫ్ట్ స్కౌట్ ను కూడా పరిచయం చేసింది. దీన్ని ప్రధానంగా మైక్రోసాఫ్ట్ 365 ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేసేలా అభివృద్ధి చేశారు. మైక్రోసాఫ్ట్ తెలిపిన ప్రకారం ఆటోపైలట్స్ అనేవి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స్వయంచాలక (ఆటోమేటిక్‌) ఏఐ ఏజెంట్లు. సాధారణ ఏఐ అసిస్టెంట్ల మాదిరిగా యూజర్ ఆదేశాల కోసం వేచి ఉండకుండా, సంస్థలోని అప్లికేషన్లు, సిస్టమ్‌ల మధ్య పనులు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకుని స్వయంగా చర్యలు తీసుకుంటాయి. ఈ ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపు (ఐడెంటిటీ) ఉంటుంది. అందువల్ల యూజర్లు లేదా సంస్థలు నిర్ణయించిన అనుమతులు, విధానాల పరిధిలోనే ఇవి పనులు నిర్వహిస్తాయి. దీంతో ఉద్యోగులు ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ అవసరమైన కార్యాచరణ కొనసాగుతుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.

మైక్రోసాఫ్ట్ తొలి ఆటో పైల‌ట్ ఏజెంట్‌..

మైక్రోసాఫ్ట్ స్కౌట్ కంపెనీ పరిచయం చేసిన తొలి ఆటోపైలట్ ఏజెంట్ కాగా ఇది క్లాడ్, డెస్క్‌టాప్, వెబ్ ఎన్విరాన్‌మెంట్ల‌లో పనిచేస్తూ మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్లతో పూర్తిగా అనుసంధానమై ఉంటుంది. స్కౌట్ టీమ్స్, అవుట్‌లుక్, వన్‌డ్రైవ్, షేర్‌పాయింట్ వంటి సేవలతోపాటు చాట్స్, ఈమెయిల్స్, క్యాలెండర్లు, కాంటాక్ట్స్ వంటి పని సంబంధిత డేటాతో కూడా కనెక్ట్ అవుతుంది. యూజర్లు టీమ్స్ ద్వారా స్కౌట్‌తో కమ్యూనికేట్ చేయవ‌చ్చు. డెస్క్‌టాప్ అప్లికేషన్ ద్వారా వెబ్ బ్రౌజర్లు, లోకల్ రిసోర్సులు, మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ (ఎంసీపీ) సర్వర్లతో కూడా ఇది పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం స్కౌట్ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ అయిన ఓపెన్‌క్లా ఆధారంగా పనిచేస్తుంది. దీనికి అదనపు భద్రత, గవర్నెన్స్, మేనేజ్‌మెంట్ ఫీచర్లను జోడించి ఎంటర్‌ప్రైజ్ వినియోగానికి సిద్ధం చేశారు.

రోజువారీ ప‌నులు మ‌రింత సులువుగా..

రోజంతా పేరుకుపోయే సమన్వయ సంబంధిత పనులను తగ్గించేందుకు స్కౌట్ ను రూపొందించారు. సమావేశాల నిర్వహణ, షెడ్యూల్ ప్లానింగ్, డెలివరబుల్స్ ట్రాకింగ్ వంటి పనుల్లో ఇది సహకరిస్తుంది. అలాగే తన తరఫున ఏ చర్యలు తీసుకుందో యూజర్‌కు తెలియజేస్తూ ఉంటుంది. వివిధ టైమ్‌జోన్లలో మీటింగ్‌ల షెడ్యూలింగ్, సమన్వయం, ముఖ్యమైన మీటింగ్‌లను గుర్తించి ముందస్తు తయారీ మెటీరియల్ రూపొందించడం, సమీపిస్తున్న డెలివరబుల్స్‌ను గుర్తించడం, క్యాలెండర్‌లో అవసరమైన సమయాన్ని ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడం, నిర్ణయాలు ఆలస్యం కావడం వంటి వర్క్‌ఫ్లో ప్రమాదాలను గుర్తించడం త‌దిత‌ర ప‌నుల‌ను ఇది నిర్వ‌ర్తిస్తుంది. స్కౌట్ వర్క్ ఐక్యూ అనే వ్యవస్థ ద్వారా కాలక్రమేణా యూజర్ పని విధానాన్ని అర్థం చేసుకుంటుంది. యూజర్‌కు ముఖ్యమైన అంశాలు ఏమిటి, తదుపరి ఏ చర్య అవసరం అవుతుందనే విషయాలను నేర్చుకుంటుంది. ఈ సమాచారం ఆధారంగా యూజర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనులను ముందుకు తీసుకెళ్తుంద‌ని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

సుర‌క్షిత‌మని నిర్దారించుకున్నాకే..

మైక్రోసాఫ్ట్ పాలసీ కన్ఫార్మెన్స్ సామర్థ్యాలను నేరుగా ఓపెన్‌క్లా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌కు అందిస్తున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో ఓపెన్‌క్లా ఉపయోగిస్తున్న సంస్థలు తమ ఎన్విరాన్‌మెంట్‌ భద్రతా, కంప్లయన్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో ధ్రువీకరించుకోవచ్చు. అలాగే సురక్షితంగా అమలు అవుతోందని నిర్ధారించుకునే ఆడిట్‌కు సిద్ధమైన ధ్రువీకరణ ఫలితాలను పొందవచ్చు. స్కౌట్‌ను మొదటి నుంచే ఎంటర్‌ప్రైజ్ భద్రతా అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రతి స్కౌట్ ఏజెంట్‌కు ప్రత్యేక మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడెంటిటీ ఉంటుంది. ఇది సాధారణ లేదా షేర్డ్ సర్వీస్ అకౌంట్‌ల మాదిరిగా కాకుండా సంస్థ డైరెక్టరీలో గుర్తింపు పొందిన ప్రత్యేక గుర్తింపుతో పనిచేస్తుంది. క్రెడెన్షియల్స్ ఎండ్-టు-ఎండ్ రక్షణతో ఉంటాయి. అవి నిర్వహిస్తున్న పనికి మాత్రమే పరిమితం అయి ఉంటాయి. లాగ్‌లు లేదా డయాగ్నస్టిక్ డేటాలో చేర్చడం జ‌ర‌గ‌దు. మైక్రోసాఫ్ట్ తన సొంత సేవలకు అనుసరించే భద్రతా ప్రమాణాలనే ఇక్కడ కూడా అమలు చేస్తోంది. స్కౌట్ యూజర్ తరఫున ఏదైనా చర్య చేపట్టినప్పుడు, ఆ చర్య ఏ యూజర్ అధికారంతో జరిగిందో సంస్థలు స్పష్టంగా గుర్తించగలుగుతాయి.

ప్ర‌తి ఏజెంట్‌కు ప్ర‌త్యేక ఐడెంటిటీ..

ప్రతి ఏజెంట్‌కు ప్రత్యేక మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడెంటిటీని ఇందులో అందించారు. టాస్క్‌కు మాత్రమే పరిమితమైన ఎండ్-టు-ఎండ్ రక్షిత క్రెడెన్షియల్స్ ను వినియోగించుకుంటుంది. సున్నితమైన చర్యలకు మానవ ఆమోదం తప్పనిసరి. మైక్రోసాఫ్ట్ పర్వ్యూ పాలసీ అమలు చేస్తారు. సెన్సిటివిటీ లేబుల్స్, డేటా లాస్ ప్రివెన్షన్ నియంత్రణలకు మద్దతు ఇస్తుంది. ఆమోద‌మైన‌ రిసోర్సులు, గమ్యస్థానాలకు మాత్రమే యాక్సెస్ ల‌భిస్తుంది. మైక్రోసాఫ్ట్ తెలిపిన ప్రకారం స్కౌట్ సంస్థల్లో ఇప్పటికే అమలులో ఉన్న నియంత్రణలను దాటదు. డేటా రక్షణ విధానాలు రియల్ టైమ్‌లో అమలవుతూ సమాచారాన్ని పంపే ముందు లేదా రాయే ముందు తనిఖీ చేస్తాయి. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇప్పటికే స్కౌట్ ప్రారంభ డెస్క్‌టాప్ వెర్షన్‌ను ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో స్కౌట్ పనుల సమన్వయం, ముందస్తు ప్రమాదాల గుర్తింపు, నిరంతర ఆదేశాలు లేకుండానే పనులు కొనసాగించడం వంటి అంశాల్లో సహాయపడినట్లు కంపెనీ వెల్లడించింది.

ఎవ‌రు పొంద‌వ‌చ్చు..

ఇప్పుడు ఎంపిక చేసిన కొంతమంది కస్టమర్లకు ప్రైవేట్ ప్రివ్యూ కార్యక్రమం ద్వారా, అలాగే ఫ్రంటియర్ సంస్థలకు ఈ సేవను విస్తరిస్తోంది. విస్తృత స్థాయి విడుదలకు ముందు సంస్థలు తమ వర్క్‌ఫ్లోల్లో దీనిని పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇక ప్రివ్యూ యాక్సెస్ కోసం ప‌లు రిక్వ‌యిర్ మెంట్ల‌ను క‌లిగి ఉండాలి. ఫ్రంటియర్ ఎన్రోల్మెంట్, ఇంట్యూన్ పాలసీ కాన్ఫిగరేషన్, ఆప్ట్-ఇన్ అటెస్టేషన్, పాల్గొనే యూజర్లకు గిట్‌హబ్ కోపైలట్ లైసెన్స్ వంటి అర్హ‌త‌లు ఉన్న‌వారు దీన్ని ట్రై చేయ‌వ‌చ్చు. ఈ అర్హతలు ఉన్న యూజర్లు మైక్రోసాఫ్ట్ స్కౌట్ అనుభవాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement