త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Threat | టేకాఫ్ అయ్యే విమానంలో బాంబు ఉంది.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్‌

Bomb Threat | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) మ‌రోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ల్దేరే విమానంలో బాంబు ఉంద‌ని, టేకాఫ్ (Takeoff) స‌మ‌యంలో అది పేలవ‌చ్చ‌ని దుండ‌గులు హెచ్చ‌రించారు.

G

Hyderabad | Published On Jul 23, 2026, 9.46 am IST

Bomb Threat | టేకాఫ్ అయ్యే విమానంలో బాంబు ఉంది.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్‌
Advertisement

Bomb Threat | త్రినేత్ర‌.న్యూస్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) మ‌రోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ల్దేరే విమానంలో బాంబు ఉంద‌ని, టేకాఫ్ (Takeoff) స‌మ‌యంలో అది పేలవ‌చ్చ‌ని దుండ‌గులు హెచ్చ‌రించారు. అప్ర‌మ‌త్త‌మైన విమానాశ్ర‌య అధికారులు విమానాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు.

గురువారం ఉద‌యం శంషాబాద్ విమానాశ్ర‌యానికి బెదిరింపు మెయిల్ వ‌చ్చింది. అందులో విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్ అయ్యే ఓ విమానంలో బాంబు ఉంద‌ని, టేకాఫ్ స‌మ‌యంలో పేలే అవ‌కాశం ఉంద‌ని అందులో పేర్కొన్నారు. దీంతో సీఐఎస్ఎఫ్‌ (CISF), బాంబు స్క్వాడ్ సిబ్బంది ఎయిర్‌పోర్టులో (Airport) ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. అన్ని విమానాలను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. టెర్మినల్‌ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలు, పార్కింగ్‌ ప్రాంతాల‌ను ప్రత్యేకంగా ప‌రిశీలించారు.

కాగా, త‌నిఖీలు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మిమాన రాక‌పోల‌కు అంత‌రాయం క‌లుగ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే ఆ మెయిల్ (eMail) ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? బెదిరింపు వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఇది నిజమైన ముప్పా? లేక ఆకతాయిల చర్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన‌ పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలిసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement