T20 World Cup Final | బ్యాట్ Vs బాల్.. అహ్మదాబాద్ వేదికగా నేడు రసవత్తర పోరు
T20 World Cup Final | టీ20 వరల్డ్‌లో భాగంగా ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) ఈ కీలక పోరుకు వేదిక కానుంది. టైటిల్‌కు ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలో నిలిచినా.. టోర్నీలో ఆయా జట్ల ప్రయాణం, బలాబలాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
T20 World Cup Final | టీ20 వరల్డ్‌లో భాగంగా ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) ఈ కీలక పోరుకు వేదిక కానుంది. టైటిల్‌కు ఇరు జట్లు ఒక్క అడుగు దూరంలో నిలిచినా.. టోర్నీలో ఆయా జట్ల ప్రయాణం, బలాబలాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. భారత బ్యాటింగ్ విభాగం అద్భుతమైన ఫామ్‌లో ఉండగా.. కివీస్ బౌలర్లు టోర్నీ మొత్తం కట్టుదిట్టంగా రాణించారు. దాంతో ఫైనల్ పోరు బ్యాటింగ్, బౌలింగ్ మధ్య ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది.
బ్యాటింగే భారత్‌కు బలం..
టీమ్ ఇండియాకు బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఓపెనర్లు సంజూ శాంసన్ (Sanju Samson), ఇషాన్ కిషన్ (Ishan Kishan) టోర్నీలో వేగంగా పరుగులు చేస్తూ జట్టుకు శుభారంభం అందించారు. శాంసన్ నాలుగు మ్యాచ్‌ల్లో 201 స్ట్రయిక్ రేట్‌తో 232 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ ఎనిమిది మ్యాచుల్లో 189 స్ట్రయిక్ రేట్‌తో 263 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా 242 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. అయితే, కీలక సందర్భాల్లో త్వరగా ఔటవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బ్యాట్‌తో 199 పరుగులు చేయడమే కాకుండా బంతితో ఎనిమిది వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. తిలక్ వర్మ (Tilak Varma)ను టీమ్ మేనేజ్‌మెంట్ ఫినిషర్‌గా పంపడం కొంత వరకు జట్టుకు ఉపయోగకరంగా మారింది.
ఆందోళన అంతా బౌలింగ్‌పైనే..
భారత్‌కు బౌలింగ్ విభాగంతో ఆందోళనగా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తప్ప మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. బుమ్రా ఏడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి 6.62 ఎకానమీ రేటుతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ప్రదర్శన చెప్పుకోదగ్గ విధంగా లేదు. పెద్ద జట్లపై ఎక్కువ పరుగులు ఇచ్చాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)పై జట్టు ఆశలు పెట్టుకున్నప్పటికీ కీలక మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఫైనల్‌కు ముందు భారత్ బౌలింగ్ కాంబినేషన్ టీమిండియాకు ఇబ్బందికరంగా మారింది. ఫైనల్ మ్యాచ్‌లో ఏమైనా మార్పులు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కివీస్ బలం బౌలింగ్
ఇదిలా ఉంటే న్యూజిలాండ్ బలం బౌలింగ్. పేసర్లు మ్యాట్ హెన్రీ (Matt Henry), లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) ప్రత్యర్థి బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రన్‌రేట్‌ను నియంత్రిస్తున్నాడు. స్పిన్‌లో రచిన్ రవీంద్ర (Rachin Ravindra) వికెట్లు సాధిస్తూ జట్టుకు కీలక విజయాలు అందించాడు. ఈ టోర్నీలో అతనే కివీస్ తరఫున అత్యధికంగా 11 వికెట్లు తీశాడు. అలాగే, బ్యాటింగ్‌లో న్యూజిలాండ్ టాప్‌ఆర్డర్ ఆకట్టుకుంది. టిమ్ సైఫర్ట్ (Tim Seifert) ఏడు మ్యాచ్‌ల్లో 161 స్ట్రయిక్ రేట్‌తో 274 రన్స్ చేశాడు. ఫిన్ అలెన్ (Finn Allen) 203 స్ట్రయిక్ రేట్‌తో 289 పరుగులు చేయడం విశేషం. మఖ్యంగా సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేశాడు. గ్లెన్ ఫిలిప్ (Glenn Phillips) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మిడిల్ ఆర్డర్‌లో మార్క్ చాప్మన్ (Mark Chapman), డారిల్ మిచెల్ (Daryl Mitchell) మాత్రం స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోయారు.
ఫైనల్‌లో బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్
ఫైనల్ మ్యాచ్ ప్రధానంగా భారత్ బలమైన బ్యాటింగ్ న్యూజిలాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటుందన్న దానిపై ఫలితం ఆధారపడనుంది. భారత బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడితే మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. కానీ, కివీస్ బౌలర్లు త్వరగి వికెట్లు పడగొట్టగలిగితే మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఫైనల్‌లో భారత్ బ్యాటింగ్, న్యూజిలాండ్ బౌలింగ్ మధ్య ఆసక్తికర పోరు కనిపించనుంది. ఇరు జట్లలో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పే అటగాళ్లు ఉన్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లో జరిగే ఈ తుదిపోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించాలంటే భారత బౌలర్లు, బ్యాటర్లకు సమానంగా సత్తాచాటాల్సిన అవసరం ఉంది. కివీస్ జట్టు సైతం మిడిలార్డర్ మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది.
Read Also :
T20 World Cup | చరిత్రకు అడుగుదూరంలో భారత్
Mitchell Santner | భారత అభిమానులను సైలెన్స్ చేస్తాం: మిచెల్ శాంట్నర్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

India vs England | ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?
జులై 2, 2026

Iceland Cricket | అతనిలో అద్భుత ప్రతిభ.. ఇలాంటి కోచ్‌ను తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదు..
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



