IPL 2027 | మళ్లీ హిట్‌మ్యాన్ చేతికి ముంబయి పగ్గాలు!
IPL 2027 | ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ మళ్లీ తన పాత సారథిపైనే నమ్మకం ఉంచింది. జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు మరోసారి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్-2027 సీజన్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
- ఐపీఎల్-2027 సీజన్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా నియామకం
- హార్దిక్ పాండ్యా పంజాబ్‌కు ట్రేడ్ కావడంతో నాయకత్వ మార్పు
- కోచింగ్ బృందంలోనూ భారీ మార్పులు.. హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్
IPL 2027 | ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ మళ్లీ తన పాత సారథిపైనే నమ్మకం ఉంచింది. జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు మరోసారి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్-2027 సీజన్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. గత మూడు సీజన్లుగా జట్టును నడిపించిన హార్దిక్ పాండ్యా ఇటీవల పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ కావడంతో కొత్త సారథి ఎంపిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన రోహిత్‌కే ముంబై యాజమాన్యం పగ్గాలు అప్పగించింది.

మళ్లీ రోహిత్‌పైనే నమ్మకం
ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మతో విడదీయలేని అనుబంధం ఉంది. 2013లో జట్టు పగ్గాలు చేపట్టిన ఆయన.. అదే ఏడాది ముంబయికి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 సీజన్లలోనూ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. మొత్తంగా ఐదు టైటిళ్లతో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. అయితే, 2023లో ముంబయి యాజమాన్యం రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి రోహిత్ ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. తాజాగా మూడేళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. దీంతో ముంబయి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది.
హార్దిక్‌కు చేదు అనుభవం
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబయి ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా ఐపీఎల్-2026లో జట్టు ప్రదర్శన తీవ్ర నిరాశపరిచింది. ఆడిన 14 లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి.. పది జట్ల పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో మరోసారి టైటిల్ కల నెరవేరలేదు. ఈ నేపథ్యంలో జట్టు ప్రక్షాళనపై దృష్టి పెట్టిన యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంది. హార్దిక్‌ను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేయగా.. ఆ జట్టు నుంచి స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబయికి తీసుకుంది. తాజాగా రోహిత్‌కు కెప్టెన్సీ అప్పగించడంతో జట్టు నాయకత్వంపై స్పష్టత వచ్చింది.
కోచింగ్ బృందంలోనూ మార్పులు
మరోవైపు జట్టు కోచింగ్ విభాగంలోనూ ముంబయి ఇండియన్స్ భారీ మార్పులు చేపట్టింది. కీరన్ పొలార్డ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. న్యూజిలాండ్ మాజీ పేసర్ మిచెల్ మెక్‌క్లెనగన్ బౌలింగ్ కోచ్‌గా, టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. మాజీ భారత పేసర్ ధావల్ కులకర్ణికి డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. ఆటగాడిగా ముంబయితో అనుబంధం ఉన్న పలువురు మాజీ క్రికెటర్లకే కోచింగ్ బాధ్యతలు అప్పగించడం విశేషం.
మినీ వేలంపై గురి
కొత్త కెప్టెన్, కొత్త కోచింగ్ బృందంతో ఐపీఎల్-2027కు సిద్ధమవుతున్న ముంబయి ఇండియన్స్.. జట్టు కూర్పుపైనా దృష్టి సారించింది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న మినీ వేలానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత సీజన్ వైఫల్యాలను అధిగమించి ఆరోసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రోహిత్ నాయకత్వంలో ముంబయి మళ్లీ తన పాత వైభవాన్ని అందుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



