Mitchell Santner | భారత అభిమానులను సైలెన్స్ చేస్తాం: మిచెల్ శాంట్నర్
Mitchell Santner | టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఫైనల్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mitchell Santner | టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఫైనల్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేడియంలో భారీగా హాజరయ్యే భారత అభిమానులను సైలెన్స్ చేయడమే తమ లక్ష్యమని స్పష్టంగా చెప్పారు. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి స్టేడియంలో లక్షకు పైగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. వారిలో అధిక శాతం మంది భారత్‌కు మద్దతు ఇవ్వనున్నారు. కాగా గత 11 సంవత్సరాల్లో ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్‌లలో ఇది న్యూజిలాండ్‌కు 5వ ఫైనల్ అని శాంట్నర్ గుర్తు చేశారు. గత దశాబ్దంగా జట్టు ఎంత స్థిరంగా ప్రదర్శన ఇచ్చిందో ఇది చూపుతుందని పేర్కొన్నారు.
భారత్‌పై ఒత్తిడి ఉంది..
అయితే గత 4 ఫైనల్స్‌లో ఒక్క దాంట్లో కూడా ట్రోఫీ సాధించలేదని శాంట్నర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక బిలియన్ మంది భారత అభిమానులను సైలెన్స్ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. అహ్మదాబాద్‌లో ఫైనల్ సందర్భంగా ఏర్పడే ఉత్కంఠభరిత వాతావరణాన్ని అంగీకరించారు. ప్రేక్షకులను నిశ్శబ్దం చేయడమే మా లక్ష్యం. టీ20 క్రికెట్‌లో అనేక అనిశ్చిత అంశాలు ఉంటాయి. ఈ ప్రపంచకప్ మొత్తం చూస్తే కూడా మ్యాచ్ ఫలితాన్ని కొన్ని చిన్న క్షణాలు మార్చగలవని చూశాం. చాలా జట్లు సమాన స్థాయిలో ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌లో కొన్ని కీలక క్షణాలే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మేము మరో పెద్ద జట్టును కూడా ఆశ్చర్యపరచగలం. ఈ ప్రపంచకప్‌ను స్వదేశంలో గెలవాలని భారత్‌పై భారీ ఒత్తిడి ఉందని నాకు అనిపిస్తోంది.. అని అన్నారు.
https://twitter.com/crickiara/status/2030209969887527027
మేం ఫేవరెట్ కాదు.. అయినా..
శాంట్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులకు మరో జ్ఞాపకాన్ని గుర్తు చేశాయి. 2023 వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే తరహాలో ఉండడం విశేషం. ఆ సమయంలో కమ్మిన్స్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత అభిమానులను సైలెన్స్ చేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. చివరకు ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకోవడంతో ఆయన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. ఇప్పుడు అదే వేదికపై మరో భారీ ఫైనల్‌కు ముందు శాంట్నర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆ జ్ఞాపకాన్ని అభిమానుల్లో ప్రస్తావనకు తెచ్చాయి. ఫైనల్‌కు ముందు తమ జట్టు ఎదుర్కొనే ఒత్తిడి గురించి కూడా శాంట్నర్ మాట్లాడారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫేవరెట్ కాదని అంగీకరించారు. అయితే టీ20 మ్యాచ్‌లలో చిన్న చిన్న క్షణాలు కూడా మ్యాచ్ దిశను పూర్తిగా మార్చగలవని అభిప్రాయపడ్డారు.
భయపడకుండా ఆడతాం..
శాంట్నర్ మాట్లాడుతూ.. ట్రోఫీ గెలవడం మాకు అభ్యంతరం లేదు. ఈ జట్టును, గతంలో ఉన్న జట్లను చూసినా మేం ఎప్పుడూ స్థిరంగా ప్రదర్శన ఇస్తున్నాం. పరిస్థితులు లేదా ప్రత్యర్థి జట్టును చూసి భయపడకుండా మేం మా ఆటను ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఈసారి కూడా జట్టు అదే విధంగా ఆడింది. ఈ ఫైనల్‌లో కూడా సవాలు పెద్దదే. అందరికీ తెలుసు మేం ఫేవరెట్ కాదని. కానీ అది మాకు పెద్ద సమస్య కాదు.. అని తెలిపారు. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు భారత్, న్యూజిలాండ్ జట్లు చేరుకున్న విధానం కూడా ఆసక్తికరంగా ఉంది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్‌లో భారత్ అధిక స్కోరింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు అంతకు ముందు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్ బెర్తు సాధించింది.
గతేడాది సరిగ్గా ఇదే సమయంలో ఇవే జట్లు..
గత ఏడాదిలోనే న్యూజిలాండ్ మరో ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్‌కు కూడా చేరుకుంది. 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కూడా కివీస్ జట్టు ఆడింది. గతేడాది సరిగ్గా మార్చి 9న ఫైనల్ మ్యాచ్ భారత్‌తో జరగ్గా, ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో మళ్లీ ఇవే రెండు జట్లు తలపడనున్నాయి. ఇది యాదృచ్ఛికంగానే జరగడం విశేషం. గతేడాది జరిగిన ఫైనల్‌లో కివీస్‌పై భారత్ విజయం సాధించి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆదివారం జరిగే ఫైనల్‌లోనూ కివీస్‌పై భారత్ గెలవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ రెండు జట్లు తలపడనున్న నేపథ్యంలో అహ్మదాబాద్ స్టేడియంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ స్వదేశంలో మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టిస్తుందా, లేక న్యూజిలాండ్ అందరి అంచనాలను తారుమారు చేసి తమ తొలి ప్రపంచ టీ20 ట్రోఫీని గెలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..






