T20 World Cup | చరిత్రకు అడుగుదూరంలో భారత్
T20 World Cup | భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రకు అడుగుదూరంలో ఉన్నది. అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడబోతున్నది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరుగనున్న ఫైనల్‌లో గెలిస్తే సరికొత్త రికార్డును నెలకొల్పనున్నది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. కివీస్‌పై విజయం సాధిస్తే వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది.
- రేపే టీ20 ప్రపంచకప్ ఫైనల్
- అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
- న్యూజిలాండ్‌పై గెలిస్తే వరుసగా రెండోసారి గెలిచిన జట్టుగా రికార్డు
- జోరుమీదున్న కివీస్ బ్యాటర్లు
- బౌలింగ్‌తోనే టీమిండియాకు తంటాలు
- ఫైనల్‌లోనూ బుమ్రాపైనే భారం
T20 World Cup | భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రకు అడుగుదూరంలో ఉన్నది. అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడబోతున్నది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరుగనున్న ఫైనల్‌లో గెలిస్తే సరికొత్త రికార్డును నెలకొల్పనున్నది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. కివీస్‌పై విజయం సాధిస్తే వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది.
వరుసగా రెండోసారి ఫైనల్‌కు..
ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీస్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌పై 7 రన్స్ తేడాతో గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షకుపైగా అభిమానుల సమక్షంలో ఫైనల్ జరగనుండగా.. చరిత్రను తిరగరాయడానికి భారత్ సిద్ధమవుతోంది. అయితే, న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నాకౌట్ మ్యాచుల్లో అంచనాలకు మించి ప్రదర్శన చేయడం ఆ జట్టుకు అలవాటు. గతాన్ని పట్టించుకోకుండా ముందున్న పరిస్థితులకు అనుగుణంగా కివీస్ బరిలోకి దిగనున్నది.
వరుసగా రెండోసారి టైటిల్ రేసులో..
గతేడాది జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్-కివీస్ జట్లు తలపడ్డాయి. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత కివీస్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారిగా. ఈ సారి ఎలాగైనా ట్రోఫీని ఎగరేసుకుపోవాలని భావిస్తోంది. అయితే వరుసగా రెండుసార్లు టైటిల్‌ను గెలిచిన చరిత్ర లేదు. అయితే, హిస్టరీ తిరగరాయాలని భారత జట్టు కృతనిశ్చయంతో ఉన్నది. టోర్నీ హిస్టరీలో ఎప్పుడూ ఒకజట్టు వరుసగా టైటిల్‌ను గెలిచిన రికార్డు లేదు. అదే సమయంలో ఆతిథ్య జట్టు పొట్టి కప్‌ను గెలిచినట్లుగా లేదు.
భారీ స్కోర్‌కి ఛాన్స్
అహ్మదాబాద్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఉపయోగించే పిచ్‌కి సంబంధించి కీలక విషయం తెలిసింది. ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండదని, బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫైనల్‌కు ఉపయోగించే సెంటర్ పిచ్‌ను ఎరుపు, నల్లమట్టితో సిద్ధం చేస్తున్నారు. ఈ పిచ్‌పై సైతం మంచి బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు కొంత సహకారం లభించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో సగటు స్కోర్ 200 వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ పిచ్ దాదాపు కొత్తదేనని, టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఫిబ్రవరి 9న కెనడా-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సాయంత్రం జరగ్గా.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా 213 పరుగులు చేయగా.. కెడనాపై 53 పరుగుల తేడాతో గెలిచింది.
టీమిండియాకు ఆందోళన..
వాంఖడే వేదికగా జరిగిన సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల భారీ టార్గెట్‌ను విధించిన భారత్.. దాన్ని కాపాడుకునేందుకు కష్టాలు పడింది. జాకబ్ బెథెల్ తన బ్యాటింగ్‌తో వణికించాడు. ఒక దశలో 100 రన్స్‌కే నాలుగు వికెట్ల కోల్పోయిన ఇంగ్లిష్ జట్టును తన అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను కొద్దిసేపు ఇంగ్లండ్ వైపు తిప్పేశాడు. అతను రనౌట్‌గా వెనుదిరగడంతో టీమిండియాకు ఊరట కలిగిందే. చివరి వరకు క్రీజులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బౌలింగ్ మారేనా..?
ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బౌలింగ్‌లో లోపాలన్నీ బయటపడ్డాయి. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా పర్వేలేదనిపించారు. ముఖ్యంగా 18వ ఓవర్‌ను బుమ్రా అద్భుతంగా వేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. జోరుమీదున్న ఇంగ్లీష్ బౌలర్లకు అడ్డుకట్ట వేశాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నాలుగు ఓవర్లు వేసి 64 పరుగులు సమర్పించాడు. కెరీర్‌లో పెద్ద సంఖ్యలో పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. కేవలం జోస్ బట్లర్ వికెట్ మాత్రమే పడగొట్టాడు. అదే సమయంలో అర్ష్‌దీప్ పెద్ద సంఖ్యలో పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి.. 51 పరుగులు ఇచ్చాడు.
ప్రత్యామ్నాయం ఎవరు..?
ఇక శివమ్ దూబే ఒక ఓవర్‌లో 21 పరుగులు ఇచ్చాడు. ఇంగ్లండ్ టార్గెట్ 30 పరుగులు ఉండడం వల్ల మ్యాచ్ ఫలితం భారత్ వైపు వచ్చిందని.. తక్కువ స్కోర్ ఉండి ఉంటే.. ఎలా ఉండేదని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి బౌలింగ్‌తో ఫైనల్‌లో న్యూజిలాండ్ గెలువడం సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిన్ అలెన్, టీమ్ సీఫెర్ట్ వంటి హిట్టర్లను ఎలా అడ్డుకుంటానరేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యామ్నాయ బౌలర్లు లేకపోవడం టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా.. వరుగా రెండు మ్యాచుల్లో సంజు శాంసన్ రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతు వస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. కీలక మ్యాచ్‌లో ఈ ఓపెనర్‌ను పక్కన పెట్టి.. రింకు సింగ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Also :
Mitchell Santner | భారత అభిమానులను సైలెన్స్ చేస్తాం: మిచెల్ శాంట్నర్
T20 World Cup | చుక్కలనంటుతున్న విమానాల టికెట్ల ధరలు.. అహ్మదాబాద్‌కు స్పెషల్ రైలు..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..






