త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harmanpreet Kaur | కెప్టెన్సీకి గుడ్‌బై.. హ‌ర్మ‌న్‌ప్రీత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Harmanpreet Kaur | భార‌త మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ (Indian Womens Team Captain) హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశారు. అన్ని ఫార్మాట్ల‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక‌పై జ‌ట్టులో సాధార‌ణ ప్లేయ‌ర్‌గా త‌న ప్ర‌యాణం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

D

Sports | Published On Oct 6, 2026, 1.29 pm IST

Harmanpreet Kaur | కెప్టెన్సీకి గుడ్‌బై.. హ‌ర్మ‌న్‌ప్రీత్ సంచ‌ల‌న నిర్ణ‌యం
Advertisement

Harmanpreet Kaur | త్రినేత్ర న్యూస్ : భార‌త మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ (Indian Womens Team Captain) హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశారు. వన్డే, టీ20, టెస్ట్.. ఇలా అన్ని ఫార్మాట్ల‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు.

"భారత మహిళల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లకు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. నేను తీసుకున్న ఈ నిర్ణ‌యం అంత సులభమైనది కాదు. ఇది ఎన్నో ఏళ్ల జ్ఞాప‌కాలు, భావోద్వేగాలు, త్యాగాల ఫ‌లితం. ఈ సుదీర్ఘ ప్ర‌యాణంలో జ‌ట్టుకోసం, భార‌త మ‌హిళా క్రికెట్ కోసం నేను నా స‌ర్వస్వాన్ని ధార‌పోశాను. ఈ ప్ర‌యాణంలో జ‌ట్టు ప్ర‌యోజ‌నాల‌కే ప్రాధాన్యం ఇస్తూ నా వ్య‌క్తిగ‌త ప్రదర్శనను, ఆశ‌యాల‌ను కూడా ప‌క్క‌న పెట్టిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. కెప్టెన్‌గా ఎన్నో క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నా. వాటివ‌ల్ల వ్య‌క్తిగ‌తంగా మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.

నేను తీసుకున్న ప్ర‌తీ నిర్ణ‌యం టీమ్ ఇండియా పురోగ‌తి, జ‌ట్టును మెరుగుప‌ర‌చ‌డం కోస‌మే. ఈ సుదీర్ఘ కెప్టెన్సీ ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తుప‌ల్లాల‌ను చూశాను. క్లిష్ట ప‌రిస్థితుల‌ను, భావోద్వేగాల‌ను, విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నా. అదే స‌మయంలో విజ‌యాల‌ను, సంబ‌రాలు వంటి మ‌ధుర క్ష‌ణాల‌ను అనుభ‌వించాను. ఈరోజు భావోద్వేగంతో నిండిన హృద‌యంతో నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను నుంచి త‌ప్పుకుంటున్నా. ఈ ప్ర‌యాణంలో త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వర్తించాననే భావిస్తున్నాను. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసినా.. జట్టులో ఒక సాధార‌ణ‌ ప్లేయర్‌గా నా ప్రయాణం కొనసాగుతుంది" అని హ‌ర్మ‌న్‌ప్రీత్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.

హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచారు. 2016లో పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్ప‌టి నుంచి జ‌ట్టు విజ‌యంలో త‌న వంతు కృషి చేశారు. 5 టెస్టులు, 51 వ‌న్డేలు, 155 టీ20ల‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. గ‌తేడాది ఆమె సారథ్యంలోనే భారత్ తన మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల తర్వాత భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఘనత హ‌ర్మ‌న్‌ప్రీత్‌కు ద‌క్క‌డం విశేషం. తాజాగా ముగిసిన ఆసియా గేమ్స్‌లో.. హ‌ర్మ‌న్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు గోల్డ్ మెడ‌ల్ సాధించిన‌ విష‌యం తెలిసిందే.

Also Read..

జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్‌

నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.. ఈనాడుపై కేటీఆర్ ఆగ్ర‌హం

మేజరైన‌ కుమార్తెను తమతోనే ఉండేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరు : హైకోర్టు

Advertisement
Advertisement