INDIA bloc | జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్
INDIA bloc | ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో ఎంపీలంతా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఒక్కసారిగా పోలీసులు అడ్డుపెట్టిన బారికేడ్లు ఎక్కి జాతీయ జెండాను ఊపుతూ నిరసన కొనసాగించారు.
INDIA bloc | త్రినేత్ర న్యూస్ : ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండీ కూటమి (INDIA bloc) సేవ్ డెమొక్రసీ పేరుతో నిర్వహించిన మార్చ్ (save democracy protest march) ఉద్రిక్తతకు దారి తీసింది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకూ ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని మార్గం మధ్యలోనే అడ్డుకున్నారు.
ఆకాశవాణి భవనం వద్ద బారికేడ్లను అడ్డుపెట్టి ఎంపీలను పోలీసులు నిలువరించారు. దీంతో ఎంపీలంతా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను కొనసాగించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాహుల్ (Rahul Gandhi) ఒక్కసారిగా పోలీసులు అడ్డుపెట్టిన బారికేడ్లు ఎక్కి జాతీయ జెండాను ఊపుతూ నిరసన కొనసాగించారు. రాహుల్ బారికేడ్ ఎక్కడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, ఎంపీలు ఒక్కసారిగా సీఈసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాసేపటి తర్వాత రాహుల్, ప్రియాంక (Priyanka Gandhi) ఉద్యోగులను కలవడానికి తమ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ఆకాశవాణి భవన్‌లోకి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది. పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు డెరెక్ ఓబ్రియన్, అభిషేక్ బెనర్జీ, ఇతర ప్రతిపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు.
#WATCH | Delhi | LoP, Lok Sabha, Rahul Gandhi waves the National Flag as he climbs atop a police barrier during INDIA bloc protest against the Election Commission of India https://t.co/7ycJvlKOyG
— ANI (@ANI) October 6, 2026
జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలి
మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి అంటూ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆయన పదవికి రాజీనామా చేయడంతోపాటూ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. సీఈసీ ఓట్ల చోరీకి ఏజెంట్‌గా వ్యవహరించారని మండిపడింది. జ్ఞానేశ్‌ను కాపాడేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదని స్పష్టం చేసింది. జ్ఞానేశ్ కుమార్‌కు అరెస్ట్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని తేల్చి చెప్పింది.
ज्ञानेश कुमार देश का गद्दार है- उसका इस्तीफा और गिरफ्तारी हो।
आज इस मांग को लेकर INDIA गठबंधन के सांसदों ने मकर द्वार से चुनाव आयोग तक विरोध मार्च निकाला।
इस दौरान कांग्रेस अध्यक्ष श्री @kharge और नेता विपक्ष श्री @Rahulgandhi मौजूद रहे।
मोदी-शाह कुछ भी कर लें... 'वोट चोरी' के एजेंट ज्ञानेश को जेल जाना ही होगा।
📍 दिल्ली
— Congress (@INCIndia) October 6, 2026
జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్
ఇదిలా ఉండగా.. సేవ్ డెమొక్రసీ మార్చ్‌కు ముందు రాహుల్ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చేయాల్సిన టైం వచ్చిందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ర్యాలీ వీడియోను పోస్టు చేశారు.
Gyanesh, it’s done, bro.
Time to resign.
#IndiaAllianceMarch https://t.co/9ZB6aJfakl
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2026
Also Read..
నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.. ఈనాడుపై కేటీఆర్ ఆగ్రహం
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pneumonic Plague | సైబీరియాలో న్యుమోనిక్ ప్లేగ్ కలకలం.. ఏంటిది.. ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి..?
- ●KTR | ఈనాడుకు కేటీఆర్ లీగల్ నోటీసులు..!
- ●KTR | నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.. ఈనాడుపై కేటీఆర్ ఆగ్రహం
- ●Allahabad High Court | మేజరైన కుమార్తెను తమతోనే ఉండేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరు : హైకోర్టు
- ●Indian Stock Market | లార్జ్ క్యాప్స్ వర్సెస్ స్మాల్ క్యాప్స్.. ఇన్వెస్టర్ల చూపు ఎటు వైపు..?
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

Pneumonic Plague | సైబీరియాలో న్యుమోనిక్ ప్లేగ్ కలకలం.. ఏంటిది.. ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి..?

KTR | ఈనాడుకు కేటీఆర్ లీగల్ నోటీసులు..!

KTR | నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.. ఈనాడుపై కేటీఆర్ ఆగ్రహం

Allahabad High Court | మేజరైన కుమార్తెను తమతోనే ఉండేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరు : హైకోర్టు





