త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Nishikant Dubey | 1970ల నాటి మారుతీ ప్రాజెక్టుకు (Maruti project) సంబంధించి ఆ సంస్థలో సోనియాకు ఉన్న హ‌క్కుల‌ను బీజేపీ (BJP) ఎంపీ నిషికాంత్ దుబే (Nishikant Dubey) ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లో సోనియా విదేశీ పౌరురాల‌ని గుర్తు చేసిన దుబే.. మారుతీ టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Maruti Technical Services Private Limited) డైరెక్టర్‌గా, వాటాదారుగా ఎలా వ్యవహరించారని నిల‌దీశారు.

D

National | Published On Nov 21, 2026, 2.14 pm IST

Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
Advertisement

Nishikant Dubey | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు సోనియా గాంధీపై (Sonia Gandhi)పై బీజేపీ (BJP) ఎంపీ నిషికాంత్ దుబే (Nishikant Dubey) సంచలన ఆరోపణలు చేశారు. 1970ల నాటి మారుతీ ప్రాజెక్టుకు (Maruti project) సంబంధించి ఆ సంస్థలో సోనియాకు ఉన్న హ‌క్కుల‌ను తీవ్రంగా ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లో సోనియా విదేశీ పౌరురాల‌ని గుర్తు చేసిన దుబే.. మారుతీ టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Maruti Technical Services Private Limited) డైరెక్టర్‌గా, వాటాదారుగా ఎలా వ్యవహరించారని ప్ర‌శ్నించారు. నిబంధనల ప్రకారం విదేశీయులు భారతీయ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండటానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా సంచ‌ల‌న ట్వీట్ చేశారు.

నవంబర్ 21, 1970న సంజయ్ గాంధీ.. సోనియా గాంధీకి చెందిన మారుతీ టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని దూబే తెలిపారు. అంతేకాదు, మారుతి కంపెనీ 1970లో ఏర్పాటైతే, అంతకు రెండేళ్ల ముందే అంటే 1968లోనే కార్ల తయారీకి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 1969లో ఇందిరా గాంధీ కేబినెట్ ఆదేశాల ద్వారా తన కోడలి కంపెనీకి ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు. ఆ తర్వాత 1972 ఏప్రిల్ 3న కంపెనీ పనుల నిమిత్తం సంజయ్ గాంధీ (Sanjay Gandhi) భారత ప్రభుత్వ ఖర్చుతో ప్రపంచ పర్యటన చేశార‌ని ఆరోపించారు.

అప్పట్లో ఇందిరా గాంధీ (Indira Gandhi) నేతృత్వంలోని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కూడా ఈ కంపెనీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందని దుబే ఆరోపించారు. గాంధీ సన్నిహితుడు, వ్యక్తిగత కార్యదర్శి అయిన ఆర్కే ధావన్‌కు కూడా దీనితో సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. "ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రైవేట్ కంపెనీ ఆఫీసు ఎలా తెరిచారు..? ప్రధాని వ్యక్తిగత కార్యదర్శి అయిన ధావన్ దానికి డైరెక్టర్ ఎలా అయ్యారు?" అని ఆయన ప్రశ్నించారు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం గాంధీ కుటుంబానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించింద‌ని దుబే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మారుతీ ప్రాజెక్టుకు భూమి కేటాయింపుపై కూడా దుబే పలు ప్రశ్నలు లేవనెత్తారు. హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ పౌరుల పేరు మీద భూమిని కేటాయించడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ 1970లో సోనియా గాంధీకి భూమి ఎలా కేటాయించారు..? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు, ఆమె కంపెనీలకు రుణాలు ఇవ్వడానికే అప్పట్లో బ్యాంకుల జాతీయీకరణ జరిగిందా..? అని నిలదీశారు. కంపెనీ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాక‌ముందే బస్సు బాడీల నిర్మాణం కోసం మారుతీకి ముందస్తు చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అందాయని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎటువంటి చెల్లింపులు లేకుండానే సిమెంట్, స్టీల్, బొగ్గును సరఫరా చేశాయని ఆయన ఆరోపించారు. ఈ అంశాల‌న్నింటిపై సోనియా గాంధీ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని దుబే స‌వాల్ విసిరారు. సొంత పెట్టుబడి లేకుండా ఇంత పెద్ద కంపెనీని ఎలా నిర్మించారో, ఇందిరా గాంధీ ఈ సంస్థను తనకు ఎలా అప్పగించారో సోనియా గాంధీ త‌న ఆత్మ‌క‌థ‌లో వివ‌రించాల‌ని డిమాండ్ చేశారు.

Also Read..

స‌న్ గ్రూప్ ఉద్యోగుల‌కు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మార‌న్‌

హైద‌రాబాద్‌ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్‌.. ఆ హోటళ్ల నుంచి ఆన్‌లైన్ డెలివ‌రీ బంద్!

వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Advertisement
Advertisement