Sachin Tendulkar | ఆ బ్యాట్ ఇప్పటికీ నాతోనే ఉంది.. చిన్ననాటి ఫొటోతో సచిన్ ఎమోషనల్ పోస్ట్!
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులను మధుర జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాడు. తన చిన్ననాటి ఫొటోతో పాటు ప్రస్తుత ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. 49 ఏళ్ల క్రితం తన చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ ఇప్పటికీ తనతోనే ఉందని వెల్లడించాడు.
Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులను మధుర జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లాడు. తన చిన్ననాటి ఫొటోతో పాటు ప్రస్తుత ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. 49 ఏళ్ల క్రితం తన చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ ఇప్పటికీ తనతోనే ఉందని వెల్లడించాడు. 'మొదట బ్యాట్ గురించే చెప్పాలి.. 49 ఏళ్ల తర్వాత కూడా అది నాతోనే ఉంది' అంటూ సచిన్ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశాడు. చిన్నతనంలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను, అదే తరహాలో బ్యాట్ పట్టుకుని ఉన్న తన ప్రస్తుత ఫొటోను జత చేశాడు. ఈ రెండు చిత్రాలు చూస్తుంటే కాలం మారినా.. ఆటపై ఆయనకున్న ప్రేమ మాత్రం మారలేదని అభిమానులు పేర్కొంటున్నారు.
16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి..
సచిన్ టెండూల్కర్ 1989లో కేవలం 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. దాదాపు 24 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించాడు. తన అసాధారణ బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. 200 టెస్టులు, 463 వన్డేలు ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2014లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నాడు. చిన్నతనంలో మొదలైన క్రికెట్ ప్రయాణం తనను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిపింది. ఇప్పుడు 49 ఏళ్ల నాటి బ్యాట్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ సచిన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Pehle bat ki baat hai, 49 saal baad bhi mere saath hai!❤️ https://t.co/kuRzxTfOoF
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!
- ●KTR | రాహుల్ బైక్ వెంట మంత్రులు పరుగెత్తడం అవమానకరం
- ●Pending Cases | కోర్టుల్లో కొండలా కేసులు..
- ●Ramchandar Rao | పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- ●Special Trains | సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. ఆరు సర్వీసులు పొడిగింపు..
- ●SIR | సర్‌లో పేరు గల్లంతైనా నో ప్రాబ్లమ్.. ఫామ్-6పై ఈసీ క్లారిటీ!

Trump Gold Card | ట్రంప్ గోల్డ్ కార్డ్ చూశారా..? అమెరికాలో స్థిరపడాలంటే ఇది కావాల్సిందే..!

KTR | రాహుల్ బైక్ వెంట మంత్రులు పరుగెత్తడం అవమానకరం

Pending Cases | కోర్టుల్లో కొండలా కేసులు..

Ramchandar Rao | పోడు భూములను రెగ్యులరైజ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు




