TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్‌లైన్ డెలివరీ బంద్!
TG SAFE Rides | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని 9 ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Officials) కొరడా ఝుళిపించారు.
TG SAFE Rides | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని 9 ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Officials) కొరడా ఝుళిపించారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు క్యూర్ (CURE) ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు శనివారం తెలిపారు. విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావడంతో పలు హోటళ్ల నుంచి స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.
అయితే ఈ తనిఖీల్లో మొత్తం 8 ప్రత్యేక బృందాలు 9 హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని 4 హోటళ్ల లైసెన్స్ లు రద్దు చేయడంతో పాటు మరో రెండింటిని సీజ్ చేశారు.
ఎక్కడడెక్కడ దాడులు జరిగాయంటే
ది స్పైస్ కిచెన్ (కూకట్‌పల్లి), రాజు గారి బిర్యానీ (చైతన్యపురి), స్వాద్ స్పైసీ (నాగోల్), మాదాపూర్ బావర్చి (అయ్యప్ప సొసైటీ), మెహఫిల్ రెస్టారెంట్ (బల్కంపేట్), అన్నపూర్ణ క్యాటరర్స్ (చందానగర్), మతామ్ అల్ యమాని అరేబియన్ రెస్టారెంట్ (టోలీచౌకి), అల్ కరీం బేకర్స్ (టోలీచౌకి), శ్రీలక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్ (గౌలిదొడ్డి) లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణం, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
వారికి ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు
మాధాపూర్ అయ్యప్ప సొసైటీలోని మాధాపూర్ బావర్చి, కూకట్‌పల్లిలోని ది స్పైస్ కిచెన్, టోలిచౌకిలోని మాతమ్ అల్ యమానీ అరేబియన్ రెస్టారెంట్, చందానగర్‌లోని అన్నపూర్ణ క్యాటరర్స్ హోటళ్ల లైసెన్సులు సస్పెండ్ చేశారు. లైసెన్సులు పునరుద్ధరించే వరకు వీటిని స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించనున్నారు. టోలీచౌకిలోని అల్ కరీం బేకర్స్, గౌలిదొడ్డిలోని శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టళ్లను అధికారులు మూసివేయగా అలాగే బల్కంపేట్‌లోని మెహఫిల్ రెస్టారెంట్ లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు.
135 కిలోల ఆహార పదార్థాలు సీజ్
కల్తీ అనుమానాలతో మొత్తం 8 ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. సుమారు 135 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి పారవేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై జరిమానాలతో పాటు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు నిర్వహించినట్లు TG SAFE కమిషనర్ వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
నవంబర్ 21, 2026

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు

Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్



