త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Honey Trap | హ‌నీట్రాప్‌ భయం.. ఐపీఎల్ ఆట‌గాళ్ల‌పై బీసీసీఐ నిఘా.. ఫ్రాంచైజీల‌కు కీల‌క ఆదేశాలు

Honey Trap | ఐపీఎల్‌లో హ‌నీట్రాప్ భ‌యం నేప‌థ్యంలో బీసీసీఐ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆట‌గాళ్ల‌పై నిఘా పెట్టింది. ఆటగాళ్లు బస చేసే హోటల్ గదుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు, మ్యాచ్ టైంలో డగౌట్‌లోని ప్లేయర్లతో ఓనర్లు అస్సలు మాట్లాడకూడద‌ని కొత్త రూల్ పాస్ చేసింది.

D

Sports | Published On May 8, 2026, 11.53 am IST

Honey Trap | హ‌నీట్రాప్‌ భయం.. ఐపీఎల్ ఆట‌గాళ్ల‌పై బీసీసీఐ నిఘా.. ఫ్రాంచైజీల‌కు కీల‌క ఆదేశాలు
Advertisement

Honey Trap | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో బీసీసీఐ (BCCI) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్ ప్రతిష్ఠను కాపాడే దిశగా, ముఖ్యంగా ఆటగాళ్లు, అధికారులు 'హనీట్రాప్' (Honey Trap) బారిన పడకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆటగాళ్లు బస చేసే హోటల్ గదుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేర‌కు అన్ని ఐపీఎల్ జ‌ట్ల‌కు ఎనిది పేజీల‌తో కూడిన లేఖ‌ను పంపింది.

మేనేజ‌ర్ అనుమ‌తి లేకుండా ఎవ‌రూ కూడా ఆట‌గాళ్ల గ‌దుల్లోకి వెళ్లేందుకు వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఆటగాళ్లను కలిసే అతిథుల వివరాలు, హోటల్‌ కదలికలన్నిటినీ రికార్డు చేయాలని సూచించింది. సెక్యూరిటీ క్లియరెన్స్ లేనిదే ప్లేయర్లు హోటల్ బయటకు వెళ్లకూడదని కండిషన్ పెట్టింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందులో షోకాజ్‌ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్‌ లేదా డిస్‌క్వాలిఫికేషన్‌ వంటి చర్యలు ఉండొచ్చని తెలిపింది. ప్రాంచైజీలు ముఖ్యంగా హనీ ట్రాప్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

గురువారం రాత్రి బీసీసీఐ కార్య‌ద‌ర్శి సైకియా (BCCI secretary, Saikia) 10 ఐపీఎల్ ఫ్రాంచైజీల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేశారు. హ‌నీట్రాప్ విష‌యంలో ఫ్రాంచైజీలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అందులో పేర్కొన్నారు. “ప్రస్తుత సీజన్‌లో చోటుచేసుకున్న‌ కొన్ని సంఘటనల దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం. అత్యున్నత స్థాయి క్రీడా వాతావరణంలో హనీట్రాప్, ఇతర ప్రమాదాలు పొంచి ఉంటాయి. వీటివల్ల లైంగిక ఆరోపణలతో సహా తీవ్రమైన చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి ముప్పును నివారించడానికి ఫ్రాంచైజీల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి. ఆట‌గాళ్లు, సిబ్బంది అంతా ప్రొటోకాల్ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా పాటించి తీరాలి" అని సైకియా ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు, మ్యాచ్ టైంలో డగౌట్‌లోని ప్లేయర్లతో ఓనర్లు అస్సలు మాట్లాడకూడద‌ని బీసీసీఐ కొత్త రూల్ పాస్ చేసింది. ఆట‌గాళ్లు త‌మ భార్య‌ల‌ను, గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ను హోట‌ల్ రూమ్‌కు తీసుకెళ్ల‌డం చేయ‌కూడ‌ద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. మేనేజ‌ర్ అనుమ‌తి తీసుకున్న త‌ర్వాత ఎవ‌రైనా ఆట‌గాళ్ల రూమ్‌లోకి వెళ్లాల‌ని సూచించింది. ఈ రూల్స్ శుక్రవారం నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి.

Also Read..

స్కైరూట్ ఏరోస్పేస్ అరుదైన ఘ‌న‌త‌.. నిజంగా స్ఫూర్తిదాయకం: కేటీఆర్‌

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌రో కొత్త వైర‌స్.. 'హంటా'.. ఏంటిది, ఎలా వ్యాప్తి చెందుతుంది..?

మారిన బీసీ కులాల పేర్లు..

Advertisement
Advertisement