KTR | స్కైరూట్ ఏరోస్పేస్ అరుదైన ఘనత.. నిజంగా స్ఫూర్తిదాయకం
KTR | భారతదేశపు మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్‌గా అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్‌ను (Skyroot Aerospace) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అభినందించారు. దీంతో భారత స్పేస్-టెక్ పరిశ్రమ నుంచి బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన మొదటి కంపెనీగా స్కైరూట్ నిలిచిందన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్: భారతదేశపు మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్‌గా (Space-tech Unicorn) అవతరించిన స్కైరూట్ ఏరోస్పేస్‌ను (Skyroot Aerospace) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అభినందించారు. దీంతో భారత స్పేస్-టెక్ పరిశ్రమ నుంచి బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన మొదటి కంపెనీగా స్కైరూట్ నిలిచిందన్నారు. టీహబ్ హైదరాబాద్‌లో ఇంక్యుబేట్ చేయబడిన హైదరాబాద్ ఆధారిత స్కైరూట్, తక్కువ సమయంలోనే అద్భుతమైన మైలురాయిని అందుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఇది మన స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు గర్వకారణమని, భారతీయ ప్రతిభ, ఆశయాల అపరిమిత సామర్థ్యానికి నిదర్శనమని వెల్లడించారు. భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ పవన్ కుమార్ చందన, భరత్ డాకా, స్కైరూట్ బృందం విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ, భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తూనే ఉండాలన్నారు.
అరుదైన ఘనత..
అంతరిక్ష రంగానికి చెందిన హైదరాబాద్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వ్యాపార అవసరాల కోసం తాజాగా 6 కోట్ల డాలర్ల (సుమారు రూ.564 కోట్లు) నిధులు సమీకరించిందీ సంస్థ. ఈ లావాదేవీలో భాగంగా కంపెనీ విలువను 110 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.10,340 కోట్లు) లెక్కగట్టారు. దీంతో స్కైరూట్ యూనికార్న్‌గా అవతరించింది. దేశంలోని తొలి స్పేస్ టెక్ యూనికార్న్ ఇదే. ఈ ఏడాదిలో యూనికార్న్ హోదా సాధించిన నాలుగో స్టార్టప్‌గా నిలిచింది. కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.9.400కోట్లు) మార్కెట్ విలువ కలిగిన స్టార్ట్‌పలను యూనికార్న్‌గా పిలుస్తారు.
ఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా కలిసి 2018లో స్కైరూట్‌ను ప్రారంభించారు. విక్రమ్ పేరుతో అంతరిక్షంలో ఉపగ్రహాలను (శాటిలైట్లు) ప్రవేశపెట్టేందుకు అవసరమైన చిన్న, మధ్యస్థాయి లాంచింగ్ రాకెట్లను ఈ సంస్థ తయారు చేస్తున్నది. విక్రమ్ ఎస్ మిషన్‌లో భాగంగా 2002లో అంతరిక్షంలోకి రాకెట్‌ను లాంచ్ చేసిన తొలి ప్రైవేట్ కంపెనీ ఇదే. ప్రస్తుతం కంపెనీ విక్రమ్-1 రాకెట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలోనే స్కైరూట్ తాజా ఫండింగ్‌కు దిగింది.
Hearty congratulations to Skyroot Aerospace on becoming India’s first space-tech unicorn! 🚀
This achievement makes @SkyrootA the first company valued at $1 billion or more to emerge from the Indian space-tech industry.
It’s truly inspiring that Hyderabad-based Skyroot,… pic.twitter.com/gy5ARGigmU
— KTR (@KTRBRS) May 8, 2026
సంబంధిత వార్తలు

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
సెప్టెంబర్ 1, 2026

Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు
సెప్టెంబర్ 1, 2026

Minister Ponnam | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేత హర్షణీయం : మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Nani | లిటిల్ ప్యారడైజ్ - కొడుకుతో నాని ఛాలెంజ్
- ●Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి
- ●YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!
- ●Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
- ●Chanakya Strategies Report Telangana | కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి.. వచ్చేది బీఆర్ఎస్సే
- ●Minister Ponnam | వెయ్యి రోజుల్లో ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు

Nani | లిటిల్ ప్యారడైజ్ - కొడుకుతో నాని ఛాలెంజ్

Aarogyasri DEOs Termination | 22 ఏళ్ల సేవలకు ఇదేనా బహుమతి

YTPS | యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు నైని బొగ్గు.. తొలిసారిగా తీసుకువచ్చిన రైలు..!

Devarakonda Family | మూడు నెలల ...మూడు సినిమాలు - దేవరకొండ ఫ్యామిలీ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!



