BCCI | సిరాజ్ ఎంపికపై బీసీసీఐ క్లారిటీ.. తుది నిర్ణయం వారిదేనంటూ..!
BCCI | న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై కొనసాగుతున్న చర్చకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. సిరాజ్‌ను అనవసర వివాదాల్లోకి లాగడం సరికాదని స్పష్టం చేశారు. తుది జట్టు ఎంపిక కోచ్, కెప్టెన్ బాధ్యత అని, పిచ్ పరిస్థితులు, వికెట్ స్వభావం, మ్యాచ్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
- కోచ్, కెప్టెన్‌దే తుది అధికారం..
- అనవసర వివాదంలోకి ఆటగాడిని లాగొద్దన్న రాజీవ్ శుక్లా
BCCI | న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై కొనసాగుతున్న చర్చకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. సిరాజ్‌ను అనవసర వివాదాల్లోకి లాగడం సరికాదని స్పష్టం చేశారు. తుది జట్టు ఎంపిక కోచ్, కెప్టెన్ బాధ్యత అని, పిచ్ పరిస్థితులు, వికెట్ స్వభావం, మ్యాచ్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. వెల్లింగ్టన్ టెస్టులో భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌లకు అవకాశం కల్పించింది. 48 టెస్టుల అనుభవం ఉన్న సిరాజ్‌ను మాత్రం పక్కనపెట్టింది. దీనిపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 9 వికెట్లకు 720 పరుగులు చేసి డిక్లేర్ చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేయలేకపోయింది. ఆతిథ్య జట్టు 5 వికెట్లకు 239 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలకు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
పిచ్ పరిస్థితులే ప్రామాణికం..
పీటీఐతో మాట్లాడిన రాజీవ్ శుక్లా.. సిరాజ్‌ను వివాదంలోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. జట్టులో అతడు భాగంగానే ఉన్నాడని, తుది జట్టులో ఎవరికి చోటివ్వాలన్నది కోచ్, కెప్టెన్ నిర్ణయమని స్పష్టం చేశారు. క్రికెటేతర కారణాలతోనే సిరాజ్‌ను తప్పించారన్న ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. పిచ్, వికెట్ స్వభావం, మ్యాచ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జట్టును ఎంపిక చేస్తారని వివరించారు. సిరాజ్‌ను పక్కనపెట్టడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని సమర్థించడం కష్టమని అభిప్రాయపడ్డారు. మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం సిరాజ్ అనుభవం, దూకుడు, సీమ్ కదలికలను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ జట్టు యాజమాన్య నిర్ణయాన్ని ప్రశ్నించారు.
వైభవ్‌పై ప్రశంసల వర్షం
ఇదే సందర్భంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై శుక్లా ప్రశంసలు కురిపించారు. యూఏఈపై 53 బంతుల్లోనే 200 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్‌కు అభినందనలు తెలిపారు. ఇంత తక్కువ బంతుల్లో 200కు పైగా పరుగులు చేయడం సాధారణ విషయం కాదన్నారు. అతడి ఆటతీరును చూసి ప్రపంచ క్రికెట్‌లోని పలువురు దిగ్గజాలు సైతం ప్రశంసించారని పేర్కొన్నారు. వైభవ్ ప్రతిభ భారత క్రికెట్ భవిష్యత్తుకు బలమని, అతడి కెరీర్ కూడా ఉన్నత స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న పోటీ శుభపరిణామం
భారత జట్టులో ఆటగాళ్ల మధ్య పెరుగుతున్న పోటీని శుక్లా స్వాగతించారు. దేశంలో క్రికెట్ ప్రతిభకు కొదవలేదని, కొత్త ఆటగాళ్లు నిరంతరం వెలుగులోకి వస్తున్నారని అన్నారు. అభిషేక్ శర్మ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని గుర్తుచేశారు. ఆటగాళ్ల మధ్య పోటీగా కాకుండా భారత క్రికెట్ అభివృద్ధికి సంకేతంగా ఈ పరిణామాన్ని చూడాలని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడం భారత క్రికెట్‌కు శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Tariffs | భారత్‌పై ట్రంప్ టారిఫ్ పిడుగు.. మరోసారి వాణిజ్య యుద్ధానికి తెర!
నవంబర్ 25, 2026

CP Ramesh | ట్రాఫిక్‌పై ఆలోచించండి.. పరిష్కారాలు చెప్పండి.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ సదస్సు..!
నవంబర్ 25, 2026

Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?
నవంబర్ 25, 2026
తాజావార్తలు
- ●US Tariffs | భారత్‌పై ట్రంప్ టారిఫ్ పిడుగు.. మరోసారి వాణిజ్య యుద్ధానికి తెర!
- ●CP Ramesh | ట్రాఫిక్‌పై ఆలోచించండి.. పరిష్కారాలు చెప్పండి.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ సదస్సు..!
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. నవంబర్ 26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Global Summit | గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం.. కీరవాణి ఆధ్వర్యంలో సమ్మిట్ ఆంథమ్ రూపకల్పన
- ●Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై విమర్శలు.. ‘ఈథా’తో మెప్పించేనా..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ మినిట్సే మరో సాక్ష్యం!

US Tariffs | భారత్‌పై ట్రంప్ టారిఫ్ పిడుగు.. మరోసారి వాణిజ్య యుద్ధానికి తెర!

CP Ramesh | ట్రాఫిక్‌పై ఆలోచించండి.. పరిష్కారాలు చెప్పండి.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ‘సైబరాబాద్ మూవ్స్’ సదస్సు..!

Traffic Restrictions | బీ అలర్ట్.. నవంబర్ 26న హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Global Summit | గ్లోబల్ సమ్మిట్ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం.. కీరవాణి ఆధ్వర్యంలో సమ్మిట్ ఆంథమ్ రూపకల్పన



