త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kadem Project | క‌ళ‌క‌ళ‌లాడుతున్న ‘క‌డెం’.. నిండు కుండ‌లా ప్రాజెక్టు

Kadem Project | ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని క‌డెం ప్రాజెక్టుకు మ‌ళ్లీ జ‌ల‌క‌ళ వ‌చ్చింది. గ‌త రెండు, మూడు రోజుల నుంచి ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో క‌డెం ప్రాజెక్టుకు వ‌ర‌ద పోటెత్తింది.

S

Telangana | Published On Sep 21, 2026, 6.54 am IST

Kadem Project | క‌ళ‌క‌ళ‌లాడుతున్న ‘క‌డెం’.. నిండు కుండ‌లా ప్రాజెక్టు
Advertisement

Kadem Project | త్రినేత్ర‌.న్యూస్ : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని క‌డెం ప్రాజెక్టుకు మ‌ళ్లీ జ‌ల‌క‌ళ వ‌చ్చింది. గ‌త రెండు, మూడు రోజుల నుంచి ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో క‌డెం ప్రాజెక్టుకు వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండు కుండ‌లా మారింది. పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 700 అడుగుల‌కు చేరింది. ప్ర‌ధాన కాలువ‌కు 467 క్యూసెక్కులు, కుడి కాలువ‌కు 11 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు.

ఈ ఏడాది జులై చివ‌రి వారంలో క‌డెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మ‌ట్టానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. నాటి నుంచి ఆయ‌క‌ట్టుకు నిరంత‌రంగా నీటిని విడుద‌ల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో కూడా పడిపోవ‌డంతో.. ప్రాజెక్టు నీటిమ‌ట్టం 699.2 అడుగుల‌కు చేరింది. గ‌త రెండు, మూడు రోజుల నుంచి కురిసిన భారీ వ‌ర్షాల‌కు 2801 క్యూసెక్కుల వ‌ర‌ద వ‌చ్చింది. దీంతో ఆదివారం సాయంత్రానికి నీటిమ‌ట్టం 700 అడుగుల‌కు చేరింది.

Advertisement
Advertisement