Harish Rao | దానం వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలు : హరీశ్‌రావు
Harish Rao | దానం నాగేందర్ అనర్హత వేటు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై ఉన్న ద్వంద్వ నీతి బట్టబయలైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీని నిలదీస్తూ ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
Harish Rao | దానం నాగేందర్ అనర్హత వేటు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై ఉన్న ద్వంద్వ నీతి బట్టబయలైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీని నిలదీస్తూ ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి ఫిరాయించడమే కాకుండా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా పోటీ చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజల తీర్పును, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన స్పీకర్ వ్యవస్థ.. అందుకు విరుద్ధంగా దానం నాగేందర్‌కు రక్షణ కవచంగా నిలవడం దురదృష్టకరమన్నారు. ఈ వ్యవహారంలో స్పీకర్ తీరుపై హైకోర్టు తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందన్నారు.
రాహుల్ కపట నాటకాలు..
దేశమంతా తిరిగి తానేదో రాజ్యాంగాన్ని రక్షించే ఛాంపియన్‌ని అని చెప్పుకునే రాహుల్‌గాంధీ కపట నాటకాలు ఈ ఘటనతో బట్టబయలయ్యాయని హరీశ్‌రావు ఆరోపించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయిస్తే ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడేలా 10వ షెడ్యూల్‌ను సవరిస్తామని కాంగ్రెస్ తన 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పలు చెప్పిందని పేర్కొన్నారు. మరి అదే పార్టీ ఫిరాయింపులు తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. మీ నిబద్ధత ఎక్కడికి పోయిందని నిలదీశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ కనీసం ఇప్పుడైనా స్పందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాజ్యాంగం, చట్ట ప్రకారం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఇతర ఎమ్మెల్యేలందరిపై ఉన్న అనర్హత పిటిషన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించాలి..
రాహుల్‌గాంధీకి నిజంగా రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే.. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో వెంటనే రాజీనామా చేయించి, మళ్లీ ప్రజల తీర్పు కోరేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని హరీశ్‌రావు అన్నారు. రాజ్యాంగం పట్ల మీకున్న నిబద్ధత నిజమైనదా? లేక మీ రాజకీయ అవసరాలకు, సౌలభ్యానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు మారుతుందా? అనేదానిపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●ఎర్రవల్లి భూముల రాజకీయం: రేవంత్ రెడ్డి అసలు వ్యూహం ఇదేనా?
- ●IPhone 18 | ఐ ఫోన్ 18తో సెలిబ్రిటీలు - ట్రెండ్ అవుతోన్న ఫొటోలు
- ●Vemula Prashanth Reddy | ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి మంచి గుణపాఠమిది
- ●TG Weather | తెలంగాణలో ఈ నెల 24 వరకు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
- ●Direct Tax Collections | కేంద్రానికి రూ.12.12 లక్షల కోట్ల ఆదాయం.. పన్ను వసూళ్లలో రికార్డు వృద్ధి..
- ●Congress MPs | హరీశ్‌రావు మామ భూమిని పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీల బృందం

ఎర్రవల్లి భూముల రాజకీయం: రేవంత్ రెడ్డి అసలు వ్యూహం ఇదేనా?

IPhone 18 | ఐ ఫోన్ 18తో సెలిబ్రిటీలు - ట్రెండ్ అవుతోన్న ఫొటోలు

Vemula Prashanth Reddy | ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి మంచి గుణపాఠమిది

TG Weather | తెలంగాణలో ఈ నెల 24 వరకు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!



