త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka MLAs niece | పీజీ చ‌దువుతూనే వైద్యురాలిగా ప్ర‌భుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేన‌కోడ‌లిపై వేటు

Karnataka MLAs niece | క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన న‌మ్మ క్లినిక్ (Namma Clinic) పథ‌కంలో భారీ అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. పీజీ చ‌దువుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేన‌కోడ‌లు (Karnataka MLAs niece) ఈ ప‌థ‌కం కింద ప్ర‌భుత్వ వైద్యురాలిగా ఉద్యోగం పొందింది.

D

National | Published On Sep 16, 2026, 2.56 pm IST

Karnataka MLAs niece | పీజీ చ‌దువుతూనే వైద్యురాలిగా ప్ర‌భుత్వ ఉద్యోగం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేన‌కోడ‌లిపై వేటు
Advertisement

Karnataka MLAs niece | త్రినేత్ర‌.న్యూస్ : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన న‌మ్మ క్లినిక్ (Namma Clinic) పథ‌కంలో భారీ అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. పీజీ చ‌దువుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేన‌కోడ‌లు (Karnataka MLAs niece) ఈ ప‌థ‌కం కింద ప్ర‌భుత్వ వైద్యురాలిగా ఉద్యోగం పొందింది. అంతేకాదు, విధుల‌కు హాజ‌రుకాకుండానే ఆమె భారీ మొత్తంలో జీతం పొంద‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

బాగ‌ల్‌కోట్ (Bagalkot) ఎమ్మెల్యే ఉమేష్ మేతి మేన‌కోడ‌లు డాక్ట‌ర్ అంకిత యార‌గ‌ల్ (Dr Ankita Yaragal) బాగ‌ల్‌కోట్‌లోని న‌మ్మ క్లినిక్‌లో వైద్యురాలిగా నియ‌మితుల‌య్యారు. ఆమె నమ్మ క్లినిక్‌లో వైద్యాధికారిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేరింది. అయితే, విధుల్లోకి చేరిన‌ప్ప‌టి నుంచి ఆమె క్లినిక్‌వైపే వెళ్ల‌లేదు. రిజిస్ట‌ర్ల‌లో సంత‌కాలు సైతం చేయ‌కుండానే.. ప్ర‌తి నెలా ఆమె ఖాతాకు పూర్తి వేత‌నం జ‌మ‌వుతోంది. ఆమె నెల‌కు రూ.70,000 జీతం తీసుకుంటున్న‌ట్లు తేలింది. మరో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే..? ఆమె ప్ర‌స్తుతం ఓ ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ చ‌దువుతున్న‌ట్లు వెల్ల‌డైంది. చ‌దువు పూర్తికాక‌ముందే ప్ర‌భుత్వ వైద్యురాలిగా ఆమెను ఉద్యోగంలో నియ‌మించ‌డం స్థానికంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సామాన్య ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన కేంద్రాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువుల అండదండలతో నిధుల దోపిడీ జ‌రుగుతోంద‌ని స్థానికులు, ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై బాగ‌ల్‌కోట్ జిల్లా పంచాయ‌తీ సీఈవో గ‌జాన‌న్ బాలే ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ మేర‌కు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని అంకితకు నోటీసులు పంపారు. ఏక‌కాలంలో వైద్యాధిరాకిగా, పీజీ మెడిక‌ల్ విద్యార్థిగా కొన‌సాగ‌డంపై వివ‌ర‌ణ కోరారు. అయితే, ఆమె ఇవాళ జ‌రిగిన‌ తొలి విచార‌ణ‌కు హాజ‌రుకాక‌పోవ‌డంతో సెప్టెంబ‌ర్ 18న ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించారు. తగిన పత్రాలు, రాతపూర్వక వివరణతో విచారణాధికారి ముందు హాజరుకావాలని ఆదేశించారు.

మ‌రోవైపు అధికారిక అనుమ‌తి లేకుండా ద్వంద్వ బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఆ కాలంలో ఆమెకు చెల్లించిన మొత్తం వేత‌నాన్ని తిరిగి వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. అంతేకాకుండా ప్రొఫెషనల్ దుష్ప్రవర్తన కింద క్రమశిక్షణా చర్యలు తీసుకుని, ఈ విషయాన్ని కర్ణాటక మెడికల్ కౌన్సిల్ (KMC), నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)లకు సిఫార్సు చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ ఆరోపణలపై అధికారిక విచారణ కొనసాగుతోంది.

Also Read..

అంత‌ర్జాతీయ జ‌లాల్లో అనూహ్య ప‌రిణామం.. భార‌త నౌక‌ను ఢీ కొట్టిన పాక్ నౌక‌

ప్ర‌తిప‌క్షాల‌ది శాడిస్టిక్ ప్లెజ‌ర్.. స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి

మెటా వన్‌.. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌కు పెయిడ్ ప్లాన్స్..

Advertisement
Advertisement