MLC Dasoju Sravan | ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపండి సీఎం గారూ..! ఎమ్మెల్సీ దాసోజు సెటైర్
MLC Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : యువత 21 ఏళ్లకే చట్టసభల్లోకి అడుగుపెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యువతకు చట్టసభలా? ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపండి సీఎం గారూ! అని సెటైర్ వేశారు దాసోజు శ్రవణ్.
MLC Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : యువత 21 ఏళ్లకే చట్టసభల్లోకి అడుగుపెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యువతకు చట్టసభలా? ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపండి సీఎం గారూ! అని సెటైర్ వేశారు దాసోజు శ్రవణ్.
వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టవోయి అని మహాకవి గురజాడ అన్నట్లు, మాటలకంటే చేతలే ముఖ్యం రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి 21 ఓకే.. మరి కాలేజీకి ఎంత? 21 ఏండ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అయినప్పుడు చట్టసభలకు రాకూడదా అని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచే ముందు.. మీ చేతిలో ఉన్న స్టూడెంట్ యూనియన్ ఎన్నికల మాట ఏంటి సీఎం గారూ? చేతుల్లో ఉన్నది చేయరు.. పార్లమెంట్ చట్టాలు మార్చడం కేంద్రం పరిధిలో ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎన్నికలు నిర్వహించడం మీ చేతుల్లోనే ఉందే! దానికి అడ్డు పడుతున్న చట్టమేది? ముందు యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్యానికి గేట్లు తెరవండి! నాయకత్వం అక్కడ నుంచే మొదలవుతుంది: నిజంగా యువతకు నిర్ణయాధికారం ఇవ్వాలనే తపన ఉంటే, ముందుగా వాళ్లకు కళాశాల క్యాంపస్‌లలోనే ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకునే అవకాశం ఇవ్వండి.
సెన్సేషన్ వార్తలు కోసం, విశ్వసనీయత లేని మాటల్లో కాదు రేవంత్ రెడ్డి గారూ... చేతల్లో చూపించండి! ముందు స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించండి .. ఆ తర్వాత 21 ఏళ్ల లీడర్‌షిప్ గురించి మాట్లాడండి! అని సీఎం రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ సూచించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..
- ●GV Prasad | నారాయణపేట డీఎఫ్‌వో అరుదైన ఘనత
- ●TG Assembly | ధరణితో భూముల ‘బందీ’.. కేసీఆర్ పాలనపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు
- ●Dasoju Sravan | ఆ ఎకరం స్థలాన్ని వెంటనే అప్పగించాలి : దాసోజు శ్రవణ్ డిమాండ్
- ●Adarsha Kutumbam | ఫ్యామిలీ మ్యాన్ .. యాక్షన్ బాట పడితే - ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చేసింది - రిలీజ్ డేట్‌పై క్లారిటీ
- ●Minister Ponguleti | కేసీఆర్ మాస్టర్ స్కెచ్ ధరణి

Sterlite Technologies | ఏడాదిలో ఏకంగా 641 శాతం రాబడి.. ఇన్వెస్టర్లపై కాసులు కురిపిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ కంపెనీ షేర్..

GV Prasad | నారాయణపేట డీఎఫ్‌వో అరుదైన ఘనత

TG Assembly | ధరణితో భూముల ‘బందీ’.. కేసీఆర్ పాలనపై పొంగులేటి తీవ్ర ఆరోపణలు

Dasoju Sravan | ఆ ఎకరం స్థలాన్ని వెంటనే అప్పగించాలి : దాసోజు శ్రవణ్ డిమాండ్





