Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
Neem Tree | వివిధ రకాల వ్యాధుల నివారణకు వేప ఆకులను విరివిగా వినియోగిస్తారు. ఎందుకంటే ఈ వేప ఆకు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మరి అలాంటి వేప చెట్ల( Neem Tree )కే వింత తెగులు తగిలింది. ఈ పరిస్థితి నల్లమల అడవుల్లో కనిపించింది.
Neem Tree | త్రినేత్ర.న్యూస్ : కరోనా తర్వాత చాలా వరకు వేప చెట్లు( Neem Tree ) ఎండిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ కొన్నాళ్లకు వేప చెట్లు చిగురించాయి. ఈ పరిస్థితి రాష్ట్రమంతటా కనిపించింది. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో వేప చెట్లకు వింత తెగులు తగిలింది. 90 శాతం వేప చెట్లు ఓ వైపు ఎండుతూ.. మరోవైపు ఆకుపచ్చగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. చాలా వేప చెట్లు కేవలం తూర్పు వైపున కొమ్మలే ఎండుతుండడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఎండిపోయిన వైపు ఆకులన్నీ గోధుమ వర్ణంలోకి మారుతున్నాయి. ఈ చెట్లకు నీటి కొరత కూడా లేదు. ఒక వేళ నీటి కొరత ఉంటే.. చెట్టంతా ఎండిపోవాలి. అలా కాకుండా కేవలం చెట్టు తూర్పు వైపు మాత్రమే కొమ్మలు ఎందుకు ఎండిపోతున్నాయనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇలా చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయో శాస్త్రీయ పరిశోధన నిర్వహించి, స్థానికుల సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు.
సంబంధిత వార్తలు

Kadem Project | కళకళలాడుతున్న ‘కడెం’.. నిండు కుండలా ప్రాజెక్టు
సెప్టెంబర్ 21, 2026

Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
సెప్టెంబర్ 20, 2026

Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘటన రోజు కారులోనే ఆమె తల్లి
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం

Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?



