PM Modi | మహిళలతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం : ప్రధాని మోదీ
PM Modi | 21వ శతాబ్దంలో తీసుకోబోయే నిర్ణయాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కీలకమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళన్‌లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
PM Modi | 21వ శతాబ్దంలో తీసుకోబోయే నిర్ణయాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కీలకమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళన్‌లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens reservation bill)ను నారీ శక్తికి అంకితం చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని అన్నారు.
“21వ శతాబ్దం మహిళలదే. మహిళా అభివృద్ధి ప్రయాణంలో అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాం. 21వ శతాబ్దంలో ఇది అతికీలక నిర్ణయం. ఈ నిర్ణయం నారీ శక్తికి అంకితం. నారీ శక్తి వందనానికి అంకితం. మన దేశ పార్లమెంట్ ఒక కొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఈనెల 16న పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రానుంది. సుదీర్ఘకాలం తర్వాత మహిళల రిజర్వేషన్ల బిల్లు వస్తోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రతి పార్టీ ముందుకు తీసుకెళ్లాలి. మహిళల కోటా బిల్లును అన్ని పార్టీలు ఆమోదించాయి. 2029లోగా మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేయాలి” అని ప్రధాని అన్నారు.
2023లో కొత్త పార్లమెంటులో నారీ శక్తి వందన్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. నారీశక్తికి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక ఉదాహరణ అని అన్నారు. కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉన్నామని సంతోషం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అని మోదీ చెప్పుకొచ్చారు. ఆర్థికమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు మహిళలకు ఉన్నత స్థానాలు కల్పించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చలకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు. ఈ బిల్లు వల్ల పంచాయతీ రాజ్ నుంచి పార్లమెంట్‌కి మహిళల ప్రయాణం సులభమవుతుందని అన్నారు. మహిళల భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read..
భారీ బ్యాటరీ, అదిరిపోయే డిజైన్‌తో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్
గోపీచంద్ హిస్టారికల్ మూవీ టైటిల్ ఇదే - క్రీస్తు శకం 642లో ఏం జరిగింది?
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు
- ●Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
- ●గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?
- ●Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ - భార్యకు బాధ్యతలు?
- ●Minister Vivek | ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి నైపుణ్య పోటీలు
- ●E10 Petrol | ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం..? పాత వాహనాల యజమానులకు ఊరట..?

National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు

Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?

Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ - భార్యకు బాధ్యతలు?






