Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ – భార్యకు బాధ్యతలు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంత బ్యానర్‌ను లాంఛ్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ బ్యానర్ బాధ్యతలను భార్య లక్ష్మిప్రణతికి ఎన్టీఆర్ అప్పగించినట్లు సమాచారం. ఈ నిర్మాణ సంస్థకు ఎన్టీఆర్‌టేన్ (NTRTAIN) అనే పేరును ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు.
Entertainment | Published On Aug 18, 2026, 8.49 pm IST
Ntr | టాలీవుడ్ హీరోలు ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు. ఓ వైపు కథానాయకులుగా సినిమాలు చేస్తూనే మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. మహేష్‌బాబు, రామ్‌చరణ్, నానితో పాటు పలువురు హీరోలు ప్రస్తుతం నిర్మాతలుగా సినిమాలు చేస్తున్నారు. ఈ హీరోల బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేయబోతున్నట్లు చెబుతున్నారు. సొంత బ్యానర్‌ను లాంఛ్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్...ఎంటర్‌టైన్‌మెంట్...
సొంత బ్యానర్ పేరును ఎన్టీఆర్‌టేన్(NTRTAIN) అనే ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈ రెండు పేర్లు కలిసేలా ఈ బ్యానర్‌కు పేరు పెట్టినట్లు చెబుతున్నారు. సొంత బ్యానర్‌పై భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా నూతన టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ లిమిటెడ్ బడ్జెట్‌లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో కూడిన చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలిసింది.
భార్యకు బాధ్యతలు...
సొంత బ్యానర్ బాధ్యతలను భార్య లక్ష్మిప్రణతికి జూనియర్ ఎన్టీఆర్ అప్పగించినట్లు సమాచారం. ఎన్టీఆర్‌టేన్ బ్యానర్‌కు ఆమెనే డైరెక్టర్‌గా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ బ్యానర్‌ను అఫీషియల్ లాంఛ్ చేయడమే కాకుండా డెబ్యూ మూవీని కూడా ప్రకటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
డ్రాగన్ మూవీ...
ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్‌కు సర్జరీ జరిగింది. ఈ సర్జరీ కారణంగా మూడు నెలలు సినిమా షూటింగ్‌కు దూరమయ్యాడు. యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతుంది. ఎన్టీఆర్ గాయం కారణంగా ఈ సినిమా వాయిదాపడే అవకాశం ఉందని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ – 71 ఏళ్ల వయసులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్
ఆగస్టు 18, 2026

Sara Arjun | రామ్‌చరణ్‌కు జోడీగా ధురంధర్ హీరోయిన్? – ఆర్సీ 17పై కొత్త రూమర్
ఆగస్టు 18, 2026

Nidhhi Agerwal | ఎట్టకేలకు ఓ ఛాన్స్ – పౌరాణిక సినిమాలో నిధి అగర్వాల్ – లేడీ ఓరియెంటెడ్ జానర్‌తో ప్రయోగం
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!
- ●National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు
- ●Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
- ●గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?
- ●Minister Vivek | ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి నైపుణ్య పోటీలు
- ●E10 Petrol | ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం..? పాత వాహనాల యజమానులకు ఊరట..?

PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!

National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు

Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?



