TET Notification | టెట్ నోటిఫికేషన్ విడుదల.. ఎల్లుండి నుంచి దరఖాస్తులు
TET Notification | తెలంగాణలో ఏటా రెండు సార్లు నిర్వహించే టెట్ నోటిఫికేషన్ (TET Notification) విడుదలైంది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు (Online applications) స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో ఏటా రెండు సార్లు నిర్వహించే టెట్ నోటిఫికేషన్-2026 (TET Notification) విడుదలైంది. విద్యాశాఖ అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపగా ఆ శాఖ కార్యదర్శి యోగితా రాణా అనుమతిచ్చారు. దీంతో ఈ ఏడాది తొలివిడత పరీక్షకు ఎట్టకేలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు (Online applications) స్వీకరించనున్నారు. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
టెట్‌లో రెండు పేపర్లు ఉండగా పేపర్-1లో ప్రాథమిక పాఠశాల (1-5) ఉపాధ్యాయ అర్హతకు, పేపర్-2లో ఉన్నత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ అర్హతకు పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లకు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. జూన్ మొదటి వారంలో హాల్‌టికెట్లు విడుదలయ్యే అవకాశం ఉండగా జూలైలో ఫలితాలు ప్రకటించే అవకాశాలున్నాయి.
అర్హతలు..
పేపర్–1కు దరఖాస్తు చేసుకోవాలంటే D.Ed లేదా B.Ed (ప్రాథమిక) అర్హత ఉండాలి. పేపర్-2కు B.Ed లేదా సంబంధిత విద్యా అర్హత కలిగి ఉండాలి. కనీసం 50% మార్కులు సాధించిన అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ముఖ్య తేదీలివే..
- ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
- జూన్ 9 నుంచి హాల్ టికెట్ల జారీ
- జూన్ 15 నుంచి 30 వరకు పరీక్ష నిర్వహణ
- జులై 28 నుంచి 31 వరకు ఫలితాలు విడుదల
ఫీజు: ఆన్‌లైన్ లో టీజీ టెట్ వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడగలరు.
వెబ్‌సైట్: https://schooledu.telangana.gov.in
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!
- ●National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు
- ●Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
- ●గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?
- ●Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ - భార్యకు బాధ్యతలు?
- ●Minister Vivek | ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి నైపుణ్య పోటీలు

PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!

National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు

Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?






