Infinix NOTE 60 Pro | భారీ బ్యాటరీ, అదిరిపోయే డిజైన్‌తో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్
Infinix NOTE 60 Pro | మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ తన నూతన స్మార్ట్ ఫోన్ నోట్ 60 ప్రొను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. నోట్ 60 సిరీస్‌లో లాంచ్ అయిన తొలి ఇన్ఫినిక్స్ ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఫ్లాగ్‌షిప్ రేంజ్ లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసినప్పటికీ దీని ధర తక్కువగానే ఉండడం విశేషం.
Technology | Published On Apr 13, 2026, 1.36 pm IST
Infinix NOTE 60 Pro | మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ తన నూతన స్మార్ట్ ఫోన్ నోట్ 60 ప్రొను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. నోట్ 60 సిరీస్‌లో లాంచ్ అయిన తొలి ఇన్ఫినిక్స్ ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఫ్లాగ్‌షిప్ రేంజ్ లో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసినప్పటికీ దీని ధర తక్కువగానే ఉండడం విశేషం. ఇన్‌ఫినిక్స్ నోట్ 60 ప్రొ వెనుక భాగంలో ఎల్‌ఈడీ సిస్టమ్‌ను కలిగి ఉంది, ఇది నథింగ్ సంస్థ గ్లైఫ్ మ్యాట్రిక్స్ డిజైన్‌లాగా కనిపిస్తుంది. ఈ ఫోన్ 4 నానోమీటర్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో పెద్ద అమోలెడ్ డిస్‌ప్లే, హై రిఫ్రెష్ రేట్, భారీ 6,500ఎంఏహెచ్ బ్యాటరీ, అలాగే 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.
వేడి తగ్గేందుకు ప్రత్యేక కూలింగ్..
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రొలో ప్రధాన ఆకర్షణగా వెనుక భాగంలో ఉన్న యాక్టివ్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ సిస్టమ్ నిలుస్తుంది. ఇది నథింగ్ గ్లైఫ్ మ్యాట్రిక్స్ ఇంటర్‌ఫేస్ నుంచి ప్రేరణ పొందిందని చెప్పవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కాల్స్, మెసేజ్‌లు, బ్యాటరీ, చార్జింగ్, నోటిఫికేషన్స్, ఇతర అప్డేట్స్ కోసం కస్టమైజ్ చేసుకునే విధంగా లైటింగ్ ప్యాటర్న్స్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 4నానోమీటర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్ ను ఇచ్చారు. గేమింగ్ వంటి తీవ్రమైన యూసేజ్ సమయంలో వేడిని తగ్గించేందుకు ప్రత్యేక 3డీ ఐస్‌కోర్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ వంటి గేమ్స్‌లో 120ఎఫ్‌పీఎస్ స్మూత్ గేమ్‌ప్లే అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్ ఉంటుంది. దీనిని అదనంగా 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకోవచ్చు. అలాగే 128జీబీ లేదా 256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఇన్‌ఫినిక్స్ ఎక్స్‌ఓఎస్ 16తో పనిచేస్తుంది.
అద్బుతమైన డిస్‌ప్లే..
నోట్ 60 ప్రొలో 6.78 ఇంచుల 1.5కె అమోలెడ్ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే ఉంది. ఇది 144హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2304హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉంది. అలాగే ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్‌ను ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో రూపొందించారు. ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఫొటోగ్రఫీ కోసం ఇందులో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 13ఎంపీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అందుబాటులో ఉంది. ఇందులో ఏఐ కామ్, వ్లాగ్, సూపర్ నైట్, డ్యుయల్ వీడియో, ప్రొ మోడ్‌లు ఉన్నాయి. అలాగే ఫ్రంట్, రియర్ కెమెరాలతో 4కే వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో 6,500ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంది. ఇది 90వాట్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 30వాట్ వైర్ లెస్ చార్జింగ్, 7.5వాట్ రివర్స్ వైర్డ్ చార్జింగ్, 5వాట్ వైర్ లెస్ రివర్స్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ప్రత్యేక ఏఐ బటన్ ను కూడా ఇచ్చారు. ఇది స్మార్ట్ ఫీచర్లకు త్వరగా యాక్సెస్ ఇస్తుంది. ఈ ఫోన్ మందం కేవలం 7.45మిల్లీమీటర్లు కాగా, బరువు సుమారు 200 గ్రాములు ఉంటుంది. ఇది సోలార్ ఆరెంజ్, డీప్ ఓషన్ బ్లూ, మోకా బ్రౌన్ రంగుల్లో లాంచ్ అయింది.
ధర ఎంతంటే..
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రొ ప్రారంభ ధర రూ.31,999గా ఉంది. ఈ ధరకు 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.34,999గా ఉంది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ ఆర్డర్ చేయవచ్చు. లాంచింగ్ సందర్భంగా దీనిపై యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో రూ.3వేల డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ.2వేల అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేసిన వారు రూ.3,999 విలువైన ఉచిత మాగ్‌పవర్ స్పీకర్‌ను పొందవచ్చు. అలాగే 1 ఏడాది కాలవ్యవధి కలిగిన వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఉచిత ఆఫర్‌ను కూడా ఇస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్‌షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



