Dimagi Naxal Party | మొన్న సీజేపీ.. ఇప్పుడు గ్రౌండ్‌లోకి దిమాగీ నక్సల్ పార్టీ..
Dimagi Naxal Party | సోషల్ మీడియాలో మరో వ్యంగ్య రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ (PM Modi).. దిమాగీ నక్సల్ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిందే దిమాగీ నక్సల్ పార్టీ.
- ప్రధాని మోదీ వ్యాఖ్యలతో పుట్టుకొచ్చిన వ్యంగ్య రాజకీయ పార్టీ
- 24 గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్
Dimagi Naxal Party | త్రినేత్ర.న్యూస్ : నేతల రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మొన్నటికి మొన్న ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది యువత సోషల్ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) చేసిన వ్యాఖ్యలతో దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరో వ్యంగ్య పార్టీ తెరపైకి వచ్చింది. అదే దిమాగీ నక్సల్ పార్టీ (Dimagi Naxal Party).
"ఆయుధాలతో తిరిగిన నక్సల్స్ ను అంతమొందించాం. కానీ ఈ దిమాగీ నక్సల్స్ (ఇంటలెక్చువల్ నక్సల్ ) సమాజంలో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఎప్పుడు అవకాశమొస్తుందా..అని ఎదురుచూస్తున్నారు. వీళ్లే పవర్ కారిడార్స్ లో తిష్ట వేసుకొని కూర్చొనేవారు. సర్కారు కమిటీల్లో ఉండేవారు. సలహాదారులుగా కూడా పనిచేశారు. వీళ్ల మైండ్ సెట్ అంతా మావోయిజంతో నిండి ఉంటుంది. వీళ్లే పాలసీలను ప్రభావితం చేసేవారు. ఇటువంటి దిమాగీ నక్సల్‌ను మనం ఓ కంట కనిపెట్టాలి. వాళ్లను ఐసొలేట్ (ఒంటరి) చేయాలి" అంటూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రసంగంలో (Independence Day speech) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిందే దిమాగీ నక్సల్ పార్టీ.
ఇదీ చదవండి.. నిన్న ‘అర్బన్ నక్సల్’.. నేడు ‘దిమాగీ నక్సల్’.. అసలెవరు వీళ్లు?
ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా కొందరు దిమాగీ నక్సల్ పేరుతో కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ పార్టీ ప్రారంభించిన 24 గంటల్లోనే ఏకంగా 1.6 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ దిమాగీ నక్సల్ పార్టీ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. సీజేపీ తరహాలోనే ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని పలువురు ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే, ఈ అకౌంట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారనే విషయం మాత్రం వెల్లడికాలేదు.
Also Read..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
స్టాక్ మార్కెట్లలో కుదుపు.. 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
శ్రావణ సోమవారం.. ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
తాజావార్తలు
- ●IPO | ఈ వారంలో ఐపీఓల జోరు.. రూ.6,400 కోట్లకు పైగా ఇష్యూలు..
- ●Bigg Boss | బిగ్‌బాస్‌తో సంపాదించింది ఏం లేదు - ప్రైజ్‌మనీ మొత్తం కట్ చేశారు - పల్లవి ప్రశాంత్ కామెంట్స్
- ●IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కుదుపు.. 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
- ●Stampede | శ్రావణ సోమవారం.. ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
- ●MCR TIMS | బిగ్ డే.. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక మైలురాయి: మంత్రి దామోదర

IPO | ఈ వారంలో ఐపీఓల జోరు.. రూ.6,400 కోట్లకు పైగా ఇష్యూలు..

Bigg Boss | బిగ్‌బాస్‌తో సంపాదించింది ఏం లేదు - ప్రైజ్‌మనీ మొత్తం కట్ చేశారు - పల్లవి ప్రశాంత్ కామెంట్స్

IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కుదుపు.. 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..






