Gopichand | గోపీచంద్ హిస్టారికల్ మూవీ టైటిల్ ఇదే – క్రీస్తు శకం 642లో ఏం జరిగింది?
గోపీచంద్ హీరోగా ఘాజీ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీకి భరతవర్ష అనే టైటిల్‌ను ఖరారు చేశారు. క్రీస్తు శకం 642వ సంవత్సరం నాటి కథతో ఈ సినిమా రూపొందుతోన్నట్లు మేకర్స్ వెల్లడించారు. భరత వర్షలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
Gopichand | హిట్టు కోసం చాలా కాలంగా వెయిటింగ్‌లో ఉన్నాడు గోపీచంద్. కథ, పాత్రల పరంగా కొత్తగా అడుగులు వేస్తోన్న విజయం మాత్రం దక్కడం లేదు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ గోపీచంద్ ఓ హిస్టారికల్ మూవీ చేస్తోన్నాడు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను సోమవారం రివీల్ చేశారు. ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు భరత వర్ష అనే టైటిల్ ఖరారు చేశారు.
642వ సంవత్సరంలో...
యాక్షన్ అంశాలతో గ్లింప్స్ ఆసక్తిని పంచుతోంది. క్రీస్తు శకం 642 సంవత్సరంలో శూల అనే ప్రాంతం చుట్టూ ఈ కథ సాగనున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ఎత్తైన పర్వతాలు ఉన్న ఓ ప్రాంతంలో తనపై దాడికి వచ్చిన శత్రువులను ఎదుర్కొంటూ ఈ గ్లింప్స్‌లో ఓ యోధుడిగా గోపీచంద్ కనిపించారు. యుద్ధ సన్నివేశాలు, విజువల్స్ తో పాటు గోపీచంద్ లుక్, క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ సినిమా కోసం అతడు మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంటోంది.చరిత్రలో మరుగున పడిన ఓ యోధుడి కథతో దర్శకుడు సంకల్ప్‌రెడ్డి భరతవర్ష సినిమాను తెరకెక్కిస్తోన్నారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదే భరత వర్ష ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రీతూ వర్మ...
భరత వర్ష మూవీలో గోపీచంద్‌కు జోడీగా రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో రీతూ వర్మ పాత్ర కూడా యాక్షన్ ప్రధానంగానే సాగనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సౌందరరాజన్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటిస్తున్న 33వ సినిమా ఇది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!
- ●National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు
- ●Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
- ●గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?
- ●Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ - భార్యకు బాధ్యతలు?
- ●Minister Vivek | ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి నైపుణ్య పోటీలు

PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!

National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు

Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?





