National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రండి.. గవర్నర్‌ను ఆహ్వానించిన ప్రతినిధులు
National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రెండురోజుల జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానించారు.
National Conclave | ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రెండురోజుల జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఆహ్వానించారు. ఈ నెల 21న తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగే ప్రారంభ ఆహ్వాన విందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు గవర్నర్ అంగీకరించారు. మంగళవారం లోకభవన్‌లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేశ్ వరికుప్పల నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందజేసింది.
జాతీయస్థాయిలో మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లు, మారుతున్న మీడియా పోకడలు, జర్నలిస్టుల పనితీరుపై గవర్నర్ సదస్సులో సందేశం ఇవ్వనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సీనియర్ జర్నలిస్టులు ఈ రెండ్రోజుల సదస్సుకు హాజరుకానున్నారు. మీడియా రంగంలో ప్రస్తుత పరిణామాలు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లపై సదస్సులో చర్చలు జరగనున్నాయి. ప్రతినిధి బృందంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏ రాజేశ్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్ధిల్లి బాపూరావు, కోశాధికారి రమేశ్ వైట్ల, కార్యవర్గ సభ్యుడు ఎన్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ డైరీని అందజేశారు. పూల మొక్కను అందించి సత్కరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!
- ●Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
- ●గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?
- ●Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ - భార్యకు బాధ్యతలు?
- ●Minister Vivek | ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి నైపుణ్య పోటీలు
- ●E10 Petrol | ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం..? పాత వాహనాల యజమానులకు ఊరట..?

PM CARES Fund audit 2025 | పీఎం కేర్స్ ఫండ్ సంచలన లెక్కలు: అకౌంట్లో రూ.8,452 కోట్లు.. కానీ ఖర్చు చేసింది మాత్రం 87 లక్షలే!

Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?

Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ - భార్యకు బాధ్యతలు?





