Minister Vivek | ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి నైపుణ్య పోటీలు
Minister Vivek | అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) కేవలం ఉద్యోగ శిక్షణ కేంద్రాలుగా కాకుండా.. యువతలో సృజనాత్మకతను వెలికితీసి ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే వేదికలుగా మారుతున్నాయని మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 119 ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి ఏటా నైపుణ్య పోటీలు నిర్వహించి.. ఉత్తమ 10 మంది ఆవిష్కర్తలను గుర్తిస్తామని చెప్పారు.
- టాప్-10 ఆవిష్కర్తలకు ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు
- మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
- మణుగూరు విద్యార్థులకు ప్రశంసలు
Minister Vivek | అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) కేవలం ఉద్యోగ శిక్షణ కేంద్రాలుగా కాకుండా.. యువతలో సృజనాత్మకతను వెలికితీసి ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే వేదికలుగా మారుతున్నాయని మంత్రి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 119 ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి ఏటా నైపుణ్య పోటీలు నిర్వహించి.. ఉత్తమ 10 మంది ఆవిష్కర్తలను గుర్తిస్తామని చెప్పారు. వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, అవార్డులతోపాటు ఏటీసీల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏటీసీని మంత్రి మంగళవారం సందర్శించారు. పదో తరగతి తర్వాత రెండేళ్ల శిక్షణతో విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు. వాటిని తయారు చేసిన పులిపాటి పార్థసారథి, స్ఫూర్తిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. శిక్షణ పూర్తి చేసి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు నియామక పత్రాలు అందించారు.
రూ.45 వేలతో ఎలక్ట్రిక్ కారు
పాత, రీసైకిల్ చేసిన విడిభాగాలతో స్ఫూర్తి సుమారు రూ.45 వేల వ్యయంతో ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. పార్థసారథి ప్రయాణికులు, సరకు రవాణాకు ఉపయోగపడే ఎలక్ట్రిక్ వాహనాన్ని రూ.1.60 లక్షలతో తయారు చేశారు. వీరి ఆవిష్కరణలు ఏటీసీల్లో అందుతున్న సాంకేతిక శిక్షణకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత నమూనాలను మరింత అభివృద్ధి చేసి వాణిజ్య స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో తయారవుతున్న వాహనాలకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 119 ఏటీసీలను టాటా గ్రూప్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.4వేల కోట్ల పెట్టుబడితో సాంకేతిక శిక్షణ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆధునిక కోర్సులు, కొత్త పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామన్నారు. మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని టాటా ప్రతినిధులు హామీ ఇచ్చారని తెలిపారు.
విద్యార్థులకు రూ.2 వేల స్టైపెండ్
ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైపెండ్ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో శిక్షణ మధ్యలోనే మానేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఏటీసీలను గ్రామీణ, గిరిజన ప్రాంతాల యువతకు ఉద్యోగావకాశాల వేదికలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. టామ్‌కామ్ ద్వారా ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించిందన్నారు. జర్మన్, జపనీస్ తదితర విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి.. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ఏర్పాటుకు..
మణుగూరు ప్రాంత యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ఐటీసీ సీఎస్‌ఆర్ నిధులతో తొలిదశలో 100 మంది యువతను ఎంపిక చేసి జర్మన్ భాషతోపాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏటీసీ విద్యార్థుల ఆవిష్కరణలు రాష్ట్రవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఒక నైపుణ్యం నేర్చుకుని, కొత్త ఆవిష్కరణకు దోహదం చేసి, మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఉపాధి శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్, రీజినల్ డైరెక్టర్ రాజా, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, అధికారులు, ఏటీసీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
- ●గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?
- ●Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ - భార్యకు బాధ్యతలు?
- ●E10 Petrol | ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం..? పాత వాహనాల యజమానులకు ఊరట..?
- ●Bhatti Vikramarka | పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామం
- ●KTR | పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడుతున్నయ్.. అందుకే దొంగల్లా తొలగించారు

Panipat Civil Hospital Crime | సీటీ స్కాన్ రూమ్‌లో దారుణం: మహిళపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

గ్లాస్‌కి తోడుగా ఫుల్ గా నాన్-వెజ్ లాగిస్తున్నారా? తిన్నాక కడుపులో ఏం జరుగుతుందో మీకు తెలుసా ?

Ntr | సొంత బ్యానర్ లాంఛ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ - భార్యకు బాధ్యతలు?

E10 Petrol | ఈ10 పెట్రోల్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం..? పాత వాహనాల యజమానులకు ఊరట..?





