Annamalai | కొత్త రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నా.. అన్నామలై కీలక ప్రకటన
Annamalai | తమిళనాడు బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) కీలక ప్రకటన చేశారు. కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెట్టబోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు (Will start new political movement).
Annamalai | తమిళనాడు బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపించగా.. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) దానిని ఆమోదించారు. కమలం పార్టీని వీడిన తర్వాత అన్నామలై కీలక ప్రకటన చేశారు. కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెట్టబోతున్నట్లు శుక్రవారం ప్రకటించారు (Will start new political movement).
ఇవాళ అన్నామలై మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తమిళనాడులో మార్పు కోసమే బీజేపీలో చేరినట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేసినట్లు చెప్పారు. అయితే, బీజేపీ అగ్రనాయత్వంతో తన అభిప్రాయాలు కలవలేదన్నారు. అభిప్రాయ భేదాల కారణంగానే బీజేపీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. "గత 18 నెలలుగా అగ్రనాయకత్వంతో పలు చర్చలు జరిపాను. ఆ సమయంలో ఇరువురి అభిప్రాయాలూ కలవలేదు. తమిళనాడు విషయంలో పార్టీ నాయకత్వంతో నా ఆలోచనలు కలవలేదు. అందుకే సీనియర్ నాయకులతో మాట్లాడిన తర్వాత.. రాజీనామా చేయడం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నా" అని అన్నామలై చెప్పుకొచ్చారు. 2025 డిసెంబర్‌లోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు అన్నామలై తెలిపారు. అయితే, ఎన్నికల తర్వాత రాజీనామా చేయమని బీజేపీ అధిష్టానం చెప్పిందన్నారు.
ఈ సందర్భంగా అన్నామలై కీలక ప్రకటన చేశారు. కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. తమిళనాడు అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే ఒంటరిగానే పోరాడనున్నట్లు ఈ సందర్భంగా అన్నామలై వెల్లడించారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే తమిళ స్టార్ రజినీకాంత్ తనతో చేతులు కలపాలని కోరారని అన్నామలై ఈ సందర్భంగా తెలిపారు. కానీ తాను మాత్రం సొంత రాజకీయ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. తమిళనాడు అస్తిత్వాన్ని వదులుకోలేనని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా అన్నామలై ప్రకటించారు. మరోవైపు తన రాజీనామా లేఖలో అన్నామలై జాతీయ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీలు ఎప్పుడూ తమిళనాడు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేదని, ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడలేదని వ్యాఖ్యానించారు.
Also Read..
మోదీపై అమెరికా ఒత్తిడి ఫలించదు.. భారత్-రష్యా సంబంధాలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
డీకే కేబినెట్‌లో కొత్త ట్విస్ట్.. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మంత్రి రాజీనామా
లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. కీలక వడ్డీ రేట్లు మూడోసారీ యథాతథం
తాజావార్తలు
- ●Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!
- ●Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా
- ●Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా..?
- ●Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే
- ●Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!

Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా

Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా..?

Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే




