Vladimir Putin | మోదీపై అమెరికా ఒత్తిడి ఫలించదు.. భారత్-రష్యా సంబంధాలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
Vladimir Putin | న్యూ ఢిల్లీ-మాస్కో (Delhi-Moscow) సంబంధాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో సంబంధాల విషయంలో న్యూఢిల్లీపై ఒత్తిడి తెచ్చేందుకు వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు. భారత్‌ను తాము అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి దేశంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
International | Published On Jun 5, 2026, 12.10 pm IST
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి పాశ్చాత్య దేశాలతో ముఖ్యంగా అమెరికాతో పెరుగుతున్న సహకారం.. రష్యాతో న్యూ ఢిల్లీకి (Delhi-Moscow) దశాబ్దాల నాటి దౌత్య సంబంధాలను దెబ్బతీయదని స్పష్టం చేశారు. అదే సమయంలో రష్యాతో సంబంధాల విషయంలో న్యూఢిల్లీపై ఒత్తిడి తెచ్చేందుకు వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు.
అమెరికా ప్రయత్నాలు ఫలించవు..
"కొన్ని విషయాల్లో భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రష్యాతో సహకారం విషయంలో ఒత్తిడి తెస్తున్న మాట నిజమే. అమెరికా ప్రయత్నాలు ఫలించవు. 150 కోట్ల జనాభా ఉన్న దేశ ప్రధానిపై (PM Modi) ఒత్తిడి తేవడం అంతర్జాతీయ సంబంధాలకు అత్యంత ప్రమాదకరం. ఈ విషయం అందరూ గ్రహించారు. ఎందుకంటే.. భారత్ ఎప్పుడూ తన సొంత జాతీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. అందువల్ల రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని లేదా తగ్గించాలని భారత నాయకత్వంపై ఒత్తిడి చేయడంలో ప్రయోజనం ఉండదు. అదే సమయంలో తమ ప్రయోజనాల కోసం భారత్ ఇతర ఏ దేశంతోనైనా సంబంధాలను పెంపొందించుకోవడాన్ని మేము స్వాగతిస్తాం" అని పుతిన్ చెప్పుకొచ్చారు.
ఆర్థిక వృద్ధిలో భారత్ టాప్..
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో విలేకరులతో మాట్లాడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా భారత్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కూడా ప్రశంసలు కురిపించారు. మాస్కోకు భారత్ మిత్రదేశమని చెప్పారు. మోదీ గొప్ప నాయకుడని పుతిన్ కొనియాడారు. ఆయన నాయకత్వంలో భారత్ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేస్తోందన్నారు. ఆర్థిక వృద్ధిలో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో నిలిచిందని ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, రాబోయే సంవత్సరాల్లో భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8.3 లక్షల కోట్లు) మైలురాయిని దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత్ మాకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి
"భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ఇండియాతో మా సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాం. దాన్ని అలాగే కొనసాగిస్తాం. భారత్‌ను మేము అత్యంత విశ్వసనీయమైన భాగస్వామిగా భావిస్తున్నాము. రాబోయే సంవత్సరాల్లో భారత్-రష్యా మధ్య ఆర్థిక సంబంధాలు మరింత విస్తరిస్తాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుత స్థాయి కంటే 30 శాతానికిపైగా పెరిగి.. 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నా" అని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read..
రుణాల వ్యవస్థలో భారీ మార్పులు.. ఒక్క ఈఎంఐ మిస్ అయినా ఇక కష్టమే..
కదులుతున్న రైలు ఇంజిన్‌పై దాడి.. లోక్‌పైలెట్‌కు తీవ్ర గాయాలు.. వీడియో
నష్టాల్లో ఈక్విటీ మార్కెట్లు.. బంగారం, వెండి ధరలపైనా ప్రభావం..
సంబంధిత వార్తలు

Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా విడుదల
ఆగస్టు 20, 2026

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
ఆగస్టు 20, 2026

Cabinet Decisions | రూ. 9,450 కోట్ల భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. ఏపీకి దక్కిన ప్రాధాన్యం
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
- ●Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
- ●TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్
- ●Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
- ●Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?

TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్



